ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలతో నియామకం.. యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి
Anirudh elected unanimously as president of the Sangem village Youth Congress వరంగల్ జిల్లా సంగెం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెల్కలపల్లి అనిరుధ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు సంగెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డాక్టర్ గుగులోత్ రమేష్ నాయక్, గ్రామ ఉపసర్పంచ్ ఆగపాటి రాజు తదితర నాయకుల సమక్షంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అనిరుధ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను సంఘటితం చేస్తానని పేర్కొన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని, తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. అనిరుధ్ ఎన్నిక పట్ల సంగెం గ్రామ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
