- అధ్యక్షుడిగా పట్టేం కోటిలింగం
Election of the Joint Regonda Press Club Committee : ఉమ్మడి రేగొండ మండల ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. అడహాక్ కమిటీ సభ్యులు కటకం రాజు, అంబాల రవీందర్, బండి సోమయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలకు మొత్తం 33 మంది అక్రిడిటెడ్, పీడీఎఫ్, యూట్యూబ్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు గాను 21 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులంతా ఏకగ్రీవంగా పట్టేం కోటిలింగాన్ని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన కోటిలింగం మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
- నూతన కార్యవర్గం
గౌరవ అధ్యక్షుడు : కటకం రాజు
గౌరవ సలహాదారు : బోట్ల ప్రవీణ్
ప్రధాన కార్యదర్శి : పకిడే నవీన్
ఉపాధ్యక్షులు : రోంటాల శంకర్, బండారి రాజు
కోశాధికారి : బండి కమలాకర్
సహాయ కార్యదర్శులు : మోటం రాజు, మంతెన మధు
సంయుక్త కార్యదర్శి : బండారి తిరుపతి ప్రచార కార్యదర్శి : గునుకంటి రాకేష్ కార్యవర్గ సభ్యులు : బొమ్మకంటి నవత్, మ్యాదరబోయిన రాజు, మార్తా రాజు ఎన్నికకాగా, ఈ కార్యక్రమంలో ఎండీ రహీం, మంతెన సురేష్, అక్కల రమేష్, అమ్మ పవన్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
