- జర్నలిజంలో వృత్తి విలువలు ప్రధానం
- డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
Tribute to journalist Emula Narsimulu జర్నలిజంలో వృత్తి విలువలు ప్రధానమని, నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలికి తీయాలని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సూచించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ జిల్లా మహా సభల సందర్భంగా శుక్రవారం సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాక సభ్యుడు ఏముల నరసింహులును మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, బండి విజయ కుమార్, మంగళ గిరి యాదగిరి తదితరులు శాలువా, మెమొంటోతో సన్మానించారు.
Tribute to journalist Emula Narsimulu
గత 25 ఏళ్లుగా జర్నలిజంలో విశిష్ట సేవలు చేసిన వారిని గుర్తించి ఈ సత్కారం చేశారు. ఏముల నర్సింహులు 1999 డిసెంబర్ 12న ప్రజాశక్తి దినపత్రికలో మహబూబ్ నగర్ టౌన్ విలేకరిగా వృత్తిలోకి చేరారు. అదే పత్రికలో 2003లో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బాధ్యతలు చేపట్టారు. 2011 వరకూ ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఆ తరువాత 2012 నుండి 2014 వరకు హైదరాబాద్ ప్రజాశక్తి/నవ తెలంగాణ దినపత్రికలో పని చేశారు. అనంతరం 2015 నుండి 2019 వరకు మహబూబ్ నగర్ సాక్షి దినపత్రిక జిల్లా డెస్క్ లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేశారు. కరోనా ప్రభావం నేపథ్యంలో జర్నలిజంలో వచ్చిన మార్పులతో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా ఏముల నర్సిములు తన వృత్తి పరంగా ప్రజాశక్తి దినపత్రికలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమస్యలపై సంచలనాత్మక కథనాలు రాశారు. కరువు, వలసలు, పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలస చావులు, అప్పుల బాధతో పేదల బలవన్మరణాలు, సాగునీటి, తాగునీటి సమస్యలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల సమస్యలపై అనేక వార్తా కథనాలు రాశారు. రైతు ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వం జస్టిస్ రాం చెన్నారెడ్డి ఏక సభ్య కమిషన్ మహబూబ్ నగర్ జిల్లా బాధిత కుటుంబాల వివరాలకు సంబందించి ప్రజాశక్తి పత్రికలో ప్రచురితమైన వివరాలను ప్రామాణికంగా స్వీకరించింది. ద హిందూ ఆంగ్ల దిన పత్రిక గ్రామీణ విభాగం ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్ మహబూబ్ నగర్ జిల్లాను సందర్శించి కరువు, వలసలు, అన్నదాతల ఆత్మ హత్యలపై కథనాలు రాసిన సందర్భంలో ఆయన బృందంలో సభ్యుడిగా నర్సిములు ఉండటం గమనార్హం.
Tribute to journalist Emula Narsimulu
జపాన్ దేశానికి చెందిన ‘ద అషాహీ సింబున్’ పత్రిక ఆసియా దేశాల జర్నలిస్ట్ వై. టెడ్డీ- తకె- యుచీ రైతు ఆత్మహత్యలపై సమాచారం నిమిత్తం మహబూబ్ నగర్ సందర్శన సందర్బంగా జర్నలిస్టు ఏముల నర్సిహులును సంప్రదించడం విశేషం. ప్రజాశక్తి దినపత్రిక ప్రపంచీకరణ విధానాలపై ఉధృత కథనాల నేపథ్యంలో అప్పటి అమెరికా అధ్యక్షుడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన వార్తా కవరేజీకి అనుమతించకుండా నిషేధించబడ్డాడు. ఖమ్మం జిల్లాలో పేదల భూ పోరాట ప్రదర్శనపై పోలీసు కాల్పులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించినందుకు అప్పటి మహబూబ్ నగర్ డీఎస్పీ నానక్ సింగ్ చేత కొన్ని గంటలపాటు నిర్బంధం ఎదుర్కొన్నాడు. “ఉత్తమ రైతుపై పగబట్టిన దొరతనం”, పులి నోట్లో అటవీ హక్కుల చట్టం”, “తాటి కల్లే తాగు నీళ్ళు” వంటి అత్యుత్తమ వార్తా కథనాలు వెలువరించి పత్రిక ఎడిటరియల్ బోర్డు నుండి నగదు బహుమతి అందుకున్నారు.
Tribute to journalist Emula Narsimulu
చర్మకార కుటుంబంలో పుట్టిన నర్సంహులుకు చిన్నప్పటి నుండీ అక్షరం అబ్బింది. ఎంతో మంది యువ జర్నలిస్టులను ప్రోత్సహించడమే కాక వృత్తి విలువలు, నిబద్దత కలిగిన జర్నలిస్టుగా పేరుపొందారు. నిన్న జరిగిన తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ నాలుగవ జిల్లా మహాసభ సందర్భంగా రెండోసారి జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
