- పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..
- జిల్లాలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వని జిల్లా ఉన్నత అధికారులు…
- కౌలు రైతులు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియని దుస్థితి
- సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్…
Tenant farmers in the impassable pass భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 45 శాతం కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక ఎకరానికి కౌలు రూ. 15వేల నుండి రూ. 60 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసుకుంటున్నారు. గతంలో వ్యవసాయ అధికారుల ద్వారా మాన్యువల్ ద్వారా కొనుగోలు చేసేది. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. తాము పండించినటువంటి పత్తి, వడ్లు ఎవరికి అమ్ముకోవాలో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుందని cpiml లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారెపెల్లి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్లాట్ బుక్ చేసుకో మంటుంది, కౌలు రైతు ఏ పట్టా పాస్ పుస్తకంతో స్లాట్ బుక్ చేసుకోవాలి..? ఎవరికి అమ్ముకోవాలి..? మధ్యదళారులకా లేక సీసీఐకా అని తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పండించిన పంటను ఎవరికి అమ్మాలి అర్థం కాక బోరుమంటున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం మాత్రం వీళ్ళ పట్ల వివక్ష చూపుతుందని, వీళ్ళు పండించిన పంటను మధ్య దళారులకు అమ్ముకొని మద్దతు ధర రాక ఇబ్బంది పడతున్నారని ఆరోపించారు. అసలే అకాల వర్షం కురవడం వలన పత్తి పంట తీవ్రంగా నష్టపోయినది. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై విలవిలాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం వీళ్లకు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలు కానరావడం లేదదని అన్నారు. తక్షణమే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పైసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్, ఏఐసిసిటీయు జిల్లా కార్యదర్శి కన్నూరి డానియల్, అనిల్, రాజేష్ పాల్గొన్నారు.
