‘Cordon and search’ operation in Chenchupalli village, under the jurisdiction of Kothapalli Gori Police Station కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచుపల్లి గ్రామంలో ఎస్సై త్రిలోక్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వాహనాలకు చలాన్లు విధించారు. ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలను కలిగి ఉండాలని ఎస్సై సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు, గంజాయికి దూరంగా ఉండాలని, వాటి అక్రమ రవాణా, వినియోగం నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై త్రిలోక్‌నాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
