టాక్సీలు ఎగ్గొట్టేందుకు ‘మూడు మిల్లుల’ డ్రామా..!
సాయి, సాయిశ్రీ పేర్ల వెనుక అసలు గుట్టు..
బట్టబయలవుతున్న మిల్లర్ వ్యవహరం..!
ఏజెన్సీ గిరిజనుల నోటికాడి ముద్ద లాగేస్తున్న వైనం..
‘Kanakadurga’ is a joke..!? : అమాయక ఏజెన్సీ ప్రజలకు అండగా ఉండాల్సిన వారే వారి నోటికాడ ముద్దను లాగేసుకుంటున్నారు. నర్సంపేట మండలం రాజిపేట కేంద్రంగా సాగుతున్న కనకదుర్గ రైస్ మిల్లు ఆగడాలు ఇప్పుడు గిరిజన పల్లెల్లో చర్చానీయాంశంగా మారుతోంది. గిరిజనులకు ప్రభుత్వం అందించే రాయితీలను వారి దరికి చేరనివ్వకుండా, మిల్లు యజమాని తన అధికారాన్ని, పరపతిని అడ్డం పెట్టుకుని నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘Kanakadurga’ is a joke..!?
టాక్సీలు ఎగ్గొట్టేందుకు ‘పేరు’ మార్పు..!
ప్రభుత్వానికి కట్టవలసిన భారీ పన్నుల నుంచి తెలివిగా తప్పించుకోవడానికి ఈ ‘మిల్లర్’ ఒక మాస్టర్ ప్లాన్ వేశారనే ప్రచారం ఉంది. కనకదుర్గ రైస్ మిల్లు పేరుతో ఉన్న బకాయిల నుంచి చట్టపరంగా తప్పుకోవడానికి, అదే ప్రాంగణంలో ‘సాయి’, ‘సాయిశ్రీ’ అనే కొత్త మిల్లుల పేర్లను సృష్టించినట్లు తెలుస్తోంది. పాత బకాయిలకు, తనకు సంబంధం లేదనే ధోరణిలో యజమాని వ్యవహరిస్తూ.. రికార్డుల్లో పేర్లు మార్చడం ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలను పొందుతూనే, ప్రజలకు ఇవ్వాల్సిన వాటాను ఎగ్గొడుతున్నట్లు మిల్లర్స్ రంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘Kanakadurga’ is a joke..!?
వరంగల్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో ఉన్న సదరు యజమాని, వ్యవస్థల మీద ఉన్న పట్టును ఏజెన్సీ ప్రజలకు మేలు చేయడానికి కాకుండా, వారిని మోసం చేయడానికి వాడుకుంటున్నారు. గిరిజన రైతులకు చెల్లించాల్సిన సబ్సిడీలు, బకాయిలను ఏళ్ల తరబడి తొక్కిపెట్టి, ప్రశ్నించిన వారిని తనకున్న రాజకీయ, సంఘ బలంతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతుండటం గమనార్హం.
‘Kanakadurga’ is a joke..!?
అధికారుల మౌనం వీడేనా..?
ఒక సామాన్య రైతు ప్రభుత్వం నుండి రూపాయి పొందుదామన్నా నిబంధనల సాకుతో తిప్పే అధికారులు, మరి ఇంత పెద్దమొత్తంలో గిరిజనుల సొమ్మును కాజేస్తున్న ఈ బడా బాబుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో మిల్లర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా రాజిపేటలోని కనకదుర్గ రైస్ మిల్లు రికార్డులను, దాని అనుబంధ మిల్లుల లావాదేవీలను తక్షణమే విచారించి బాధితులకు న్యాయం చేయాలని, గిరిజన రైతుల శ్రమను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.
