రైస్ మిల్లుల మాటున ‘అధ్యక్షుడి’ సామ్రాజ్యం..
రాయితీలు మాయం చేసిన వైనం..!
‘Kanakadurga Mill’ witnesses robbery..!?
అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాల్సిన వారే.. వారి నోటి కాడ ముద్దను లాగేసుకుంటున్నారు. నర్సంపేట మండలం రాజిపేట కేంద్రంగా సాగుతున్న కనకదుర్గ రైస్ మిల్లు ఆగడాలు ఇప్పుడు గిరిజన పల్లెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. అమాయక ఏజెన్సీ గిరిజనులకు ప్రభుత్వం అందించే రాయితీలను వారి దరికి చేరనివ్వకుండా, మిల్లు యజమాని తన అధికారాన్ని, పరపతిని అడ్డం పెట్టుకుని నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘Kanakadurga Mill’ witnesses robbery..!?
వరంగల్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో ఉన్న సదరు యజమాని, వ్యవస్థల మీద ఉన్న పట్టును రైతులకు మేలు చేయడానికి కాకుండా, వారిని మోసం చేయడానికి వాడుకుంటున్నారు. గిరిజన రైతులకు చెల్లించాల్సిన సబ్సిడీలు, బకాయిలను ఏళ్ల తరబడి తొక్కిపెట్టి, ప్రశ్నించిన వారిని తనకున్న రాజకీయ, సంఘ బలంతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
‘Kanakadurga Mill’ witnesses robbery..!?
తప్పించుకునేందుకు ‘మూడు మిల్లుల’ డ్రామా..!
ఈ అక్రమ బకాయిల నుండి తప్పించుకోవడానికి ఈ ‘అధ్యక్షుడు’ మాస్టర్ ప్లాన్ వేశారు. కనకదుర్గ రైస్ మిల్లు పేరుతో ఉన్న బకాయిల నుంచి చట్టపరంగా తప్పించుకోవడానికి, అదే ప్రాంగణంలో లేదా అదే యాజమాన్యం కింద మరో రెండు కొత్త మిల్లుల పేర్లను సృష్టించినట్లు తెలుస్తోంది. కొత్త పేర్లతో మిల్లులను చూపిస్తూ, పాత బకాయిలకు తనకు సంబంధం లేదనే ధోరణిలో యజమాని వ్యవహరిస్తున్నారు.రికార్డుల్లో మిల్లుల పేర్లు మార్చడం ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలను పొందుతూనే, రైతులకు ఇవ్వాల్సిన వాటాను ఎగ్గొడుతున్నారు. ఒక సామాన్య రైతు ప్రభుత్వం నుండి రూపాయి పొందుదామన్నా నిబంధనల సాకుతో తిప్పే అధికారులు, మరి ఇన్ని కోట్లు గిరిజనుల సొమ్మును కాజేస్తున్న ఈ బడా బాబుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి, రాజిపేటలోని కనకదుర్గ రైస్ మిల్లు రికార్డులను, దాని అనుబంధ మిల్లుల లావాదేవీలను విచారించి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
