త్రీవిల్లర్ స్కూటీల గోల్మాల్పై పట్టింపు లేని అధికారులు…
‘Reckless’ water on the hopes of the disabled in Bhupalapally : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో త్రీవీలర్ స్కూటీల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అర్హులకు అన్యాయం జరుగుతోందని, అనర్హులకు కట్టబెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత అధికారులు కనీస విచారణకు కూడా సిద్దపడకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలపై ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారించకపోవటాన్ని ఆసరాగా చేసుకొని ఆ శాఖాధికారులు స్కూటీల గోల్ మాల్ వ్యవహారం పట్ల మరింత గోప్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డుపై ఉంచాలని నిబంధనలు చెప్తున్నా, నేటికీ ఆ వివరాలను బయట పెట్టకపోవటం, దరఖాస్తు చేసుకున్న వారికి సైతం జాబితా తెలియకుండా గోప్యంగా ఉంచటం గోల్ మాల్ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నదని పలువురు భావిస్తున్నారు. ఎంపికైన వారి వివరాలు వెల్లడించకుండానే, గుట్టుచప్పుడు కాకుండా వాహనాలను అందజేసేందుకు మరింత అనుమానాలను రేకితిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే బాధితులకు, దరఖాస్తుదారులకు సరైన సమాధానం చెప్పకుండా ఇప్పటికీ పాత పాటనే వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
‘Reckless’ water on the hopes of the disabled in Bhupalapally..!
బాధితులు ఆవేదన
చదువుకునే విద్యార్థులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని జీవోలు స్పష్టం చేస్తున్నాయి. కానీ భూపాలపల్లిలో మాత్రం పలుకుబడి, పైస్థాయి సిఫార్సులే అర్హతలుగా మారుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మేము దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నాం. కానీ అడిగితే సరైన సమాధానం లేదు. పారదర్శకత లేని ఈ పంపిణీ వల్ల అసలైన వికలాంగుల ఆశలు అడియాశలవుతున్నాయి.” – ఒక బాధిత దరఖాస్తుదారుడు
‘Reckless’ water on the hopes of the disabled in Bhupalapally..!
కలెక్టర్ గారు.. స్పందించండి..!
ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల జోక్యం అనివార్యంగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ గారు ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరిపించి జిల్లాకు మంజూరైన స్కూటీల సంఖ్యను బహిర్గతం చేయాలి. లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగిందో వివరించాలి. గతంలో పొందిన వారే మళ్ళీ పొందుతున్నారా..? అనర్హులకు పంపిణి జరిందా..? అనే కోణంలో విచారణ చేయాలి. దివ్యాంగుల కష్టాలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, అర్హులకు న్యాయం చేయాలని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.
