జన నిర్ణయం / శాయంపేట :
Unveiling of the ‘Jana Nirnayam’ Bathukamma and Dasara Special Edition : జన నిర్ణయం దినపత్రిక ఆశ్వయుజ మాస పండుగలను పురస్కరించుకొని ముద్రించిన ‘బతుకమ్మ – దసరా ప్రత్యేక సంచిక’ను శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) సుధాకర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) జక్కుల పరమేష్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శాయంపేట జన నిర్ణయం రిపోర్టర్ ఉప్పు నర్సయ్య ప్రత్యేక సంచిక ప్రతులను వారికి అందించారు. పండుగల విశిష్టతను, సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సంచికను తీసుకురావడం అభినందనీయమని అధికారుల బృందం కొనియాడారు. ప్రజలకు, దినపత్రిక సిబ్బందికి విజయాదశమి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
