Rajanal Srihari unveils the Bathukamma-Dasara special edition : గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ‘జన నిర్ణయం’ దినపత్రిక ఆవిష్కరించిన బతుకమ్మ, దసరా పండుగల ప్రత్యేక సంచికను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, విజయదశమి పండుగల ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రత్యేక సంచికను తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ, పత్రికలు ప్రజా సమస్యలను వెలికితీస్తూనే, సాంస్కృతిక విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘జన నిర్ణయం’ రిపోర్టర్లు రంజిత్, రమేష్ లు ఈ సందర్భంగా రాజనాల శ్రీహరికి ప్రత్యేక సంచికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
