TUWJ 143 Mohammed Abdullah elected as Vice President of Parkal Division : టియుడబ్ల్యూజే 143 జర్నలిస్ట్ యూనియన్ పరకాల డివిజన్ స్థాయి ఎన్నికలు ఇటీవల పరకాల పట్టణంలోని మహదేవ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యుల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో పరకాల డివిజన్ వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరకాల డివిజన్ టీయూడబ్ల్యుజే 143 అధ్యక్షుడిగా కడివెండి ధనుంజయ, కార్యదర్శిగా కానుగంటి కరుణాకర్, కోశాధికారిగా సుదర్శన్, ఉపాధ్యక్షుడిగా రావుల రాజు తెలంగాణ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ మీడియా బండారి గిరిప్రసాద్ ప్రధాన కార్య దర్శిగా మాడ విజయ్ ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్లాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమపై నమ్మకంతో డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీ జిల్లా నాయకులకు మహమ్మద్ అబ్దుల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అభివృద్ధి కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అబ్దుల్లా పేర్కొన్నారు.
