MRPS village committee formed in Pattipaka అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మండల కో–ఇన్చార్జి మామిడి భాస్కర్, ఎమ్మార్పీఎస్ శాయంపేట మండల మాజీ అధ్యక్షుడు తుడుం వెంకటేష్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో లభించే ఫలాలను మాదిగ విద్యార్థులు అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, సామాజిక సంక్షేమ రంగాల్లో ముందుకు సాగాలని వారు సూచించారు. సెప్టెంబర్ 9న వరంగల్లో జరిగే మాదిగల మండల స్థాయి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అవార్డు గ్రహీత మందా కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. దండోరా ఉద్యమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పత్తిపాక సర్పంచ్ గజ్జి ఐలయ్య, ఉపసర్పంచ్ తుడుం రాజు, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు గజ్జి, గ్రామ అధ్యక్షుడు నక్క మహేష్, అధికార ప్రతినిధి తుడుం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు కత్తి విజయ్, తుడుం మహేందర్, ఉపాధ్యక్షులు ముళ్లపల్లి నాగేష్, గజ్జి సురేష్, కోశాధికారి గజ్జి రాజు, కార్యదర్శులు తుడుం గోవర్ధన్, దామెర ప్రవీణ్, తుడుం మహేష్, పెరుమాండ్ల భద్రయ్య, పసుల ప్రవీణ్, అర్షం కిషన్, గజ్జి సదానందం, పోతుగంటి సాంబరాజు, గజ్జి సురేందర్, తప్పెట్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
