50 కిలోల బియ్యం పంపిణీ
Gram Panchayat administration stands by the affected families : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో మానవత్వం వెల్లివిరిసింది. ఇటీవల అనారోగ్యంతో మరణించిన బుర్రి సాంబయ్య, మహమ్మద్ యాకూమియా కుటుంబాలను పత్తిపాక గ్రామపంచాయతీ పాలకవర్గం ఆదివారం పరామర్శించింది. ఇటివల మరణించిన వారి నివాసాలకు వెళ్లిన ఉప సర్పంచ్ తుడుం రాజు, వార్డు సభ్యులు, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రతినిధులు తమ సొంత ఖర్చులతో ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసి, ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక బాధ్యతతో వార్డు మెంబర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి పాల్గొన్నారు. కార్యక్రమంలో
నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరం సాయిలక్ష్మీ మొగిలి, కోడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు, పోతుగంటి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రతినిధులు చూపిస్తున్న ఈ చొరవను పత్తిపాక గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.
