- అమలుకు నోచుకొని గత రాష్ట్ర బడ్జెట్
Election promises in the education sector are like a dream : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది రెండు దఫాలు విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలకు నోచుకోని నీధులు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు స్కాలర్షిప్ నుండి మొదలుకొని మేస్ కాస్మోటిక్ చార్జీలు మధ్యాహ్న భోజనం మరియు బెస్ట్ అవేలెబుల్ స్కూల్ స్కీమ్ కింద చదువుకుంటున్న విద్యార్థులు ఫీజుబకాయిల వరకు విడుదల చేస్తాము అని చెప్తూనే ఈ క్రింది హామీలు ఇవ్వటం జరిగింది. విద్యార్థులకి విద్య భరోసా కార్డు ద్వారా కళాశాలలో చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కోసం విద్య భరోసా కార్డును ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఆచరణలో అమలు చేయకపోయినా కళాశాల విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 8350 కోట్లు బకాయి ఉంటే విద్యార్థులు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల యజమాన్యం విద్యాసంస్థల బంద్ పిలుపునిస్తే 2025 సెప్టెంబర్ నాటికి 600 కోట్లు మంజూరు చేసి దపాల వారిగా నిధులు మంజూరు చేస్తాము అని హామీ ఇచ్చి నేటికీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల గాక విద్యార్థులకి ప్రవేట్ కార్పొరేట్ విద్య సంస్థలు సర్టిఫికెట్స్ ఇవ్వక ఉన్నత విద్య మధ్యలోనే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అంటూ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
Election promises in the education sector are like a dream…!?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే అందమైన పేరు పెట్టి 15600 కోట్లు తో 78 విద్యాసంస్థలకు భవనాలకు శంకుస్థాపన చేసింది ఆచరణ లో ఒక్క స్కూల్ భవనం కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి పూర్తి చేసుకొని విద్యాసంస్థ ప్రారంభం కాలేదు, రాష్ట్రంలో 662 గురుకులకి స్వంత భవనాలు లేక అద్దె భవనాల్లో సుమారుగా నెలకి 20 కోట్లు అద్దె చెలిస్తున్నారు కానీ ఒక్క గురుకుల పాఠశాలకు సొంత భవనం నిర్మాణం చేయాలని చిత్తశుద్ధితో నిధులు కేటాయించిన పరిస్థితి లేదు ,పేరుకు కేటాయించిన అమలుకు నోచుకోలేదు. ఉపాధ్యాయ నియమకాలు ఆరు నెలల మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం భర్తీ చేస్తామని అన్నారు, కానీ ఆచరణలో గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షకు నియామకాలు నిర్వహించి విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ చేయకుండా గాలికి వదిలేసారు.
Election promises in the education sector are like a dream…!?
విద్యా రంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి గత బడ్జెట్లో 23. 108 కోట్లు అనగా సుమారుగా 7.93 శాతం మాత్రమే నిధులు కేటాయించడం జరిగింది దాని ఫలితంగా నేడు వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులు సుమారుగా 8 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ పేరుకు మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచారు కానీ సకాలంలో నిధులు మంజూరు గాక నెలల తరబడి మెస్ కాస్మొటిక్ నిధులు మంజూరు కాకపోవటం తో ముఖ్యమంత్రిగారు చూస్తున్న శాఖలోని విద్యార్థులు పౌష్టికరమైన భోజనం సకాలం నిధులు మంజూరు కాక అర్ధాకలితో విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు.అక్కడ అక్కడ విద్యార్థులు రోడ్డు ఎక్కి మాకు నేను ప్రకారం పౌష్టికమైన ఆహారం కావాలి ధర్నాలకి దిగుతున్నారు ముఖ్యమంత్రి గారి ఉమ్మడి మహబూబ్నగర్ లో విద్యార్థులు రోడ్ ఎక్కి తిరుగుబాటు చేస్తున్నారు.
Election promises in the education sector are like a dream…!?
ఉచిత ఇంటర్నెట్ తో విద్యార్థులకు అందరికీ వైఫై సౌకర్యం కల్పించి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోక ప్రవైట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుకున్న ST,SC,BC విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల కాక విద్యార్థులు విద్యార్థుల విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రలతో కలెక్టరేట్ ఆఫీస్ ల ముందు ధర్నాలు చేయాల్సిన వస్తుంది. మైనార్టీ విద్యార్థులు అబ్దుల్ కలాం తౌస తాలీమ్ పథకం కింద ఏం ఫిల్ మరియు PHD చేసిన విద్యార్థులకి 1 లక్ష రూపాయిలు డిగ్రీ చేసిన వరకు 25000 బహుమతి ఇస్తాము అని హామీ ఇచ్చి మైనార్టీ మైనార్టీ విద్యార్థులకి ఇవ్వాల్సి నెలకి 500 రూపాయిలు ప్యాకెట్ మణి డబ్బులు కూడా స్వంత అకౌంట్ లేదు అనే పేరుతో సుమారుగా 60 కోట్ల రూపాయిలు వెనక్కి తీసుకుంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా జరుగుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం గానీ సంబంధిత ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడడం లేదు L KG విద్యార్థికి 2 లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు విద్యాహక్కు చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలల్లో 25% సీట్లు కేటాయించాల్సి ఉండగా వాటి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. అమలుకోసం ఎలాంటి కృషి చేయటం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చి మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పి నాసిరకం భోజనంతో విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్న కాంట్రాక్ట్ తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు లేవు కానీ ఆ రోజు డ్యూటీ లో ఉన్న అధికారినీ పై చర్యలు తీసుకుంటాము అని కాలం దాటివేస్తున్నారు.పౌష్టికరమైన ఆహారం అందించాలని ఫుడ్ సూచనలు కూడా సరిగా చేసిన పరిస్థితి లేదు. పుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను కనీసం పరామర్శించిన దాకాలు లేదు విద్యాశాఖ మంత్రి గా ఉన్న ముఖ్యమంత్రి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ఎస్సీ ,ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక సహకారం కింద 25 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విదేశీయులకు వెళ్తున్న విద్యార్థులకు గతం నుండి ఇవ్వాల్సిన కనీస ఆర్థిక సహకారం కూడా పెండింగ్ ఉండడంతో విదేశీల్లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ,వారి తల్లిదండ్రులు ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ మంత్రి కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలకి ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినా ముఖ్యమంత్రి గారు, విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకునిగా ఎదిగినా ముఖ్యమంత్రి గారు ఆచరణలో అధికారంలో వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కి రెండు సార్లు వెళ్ళారు కానీ విద్యార్థి సంఘాల ఎన్నికల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు విద్యారంగం కి ఇచ్చిన హామీలు అమలు జరగాలి అంటే కొఠారి కమిషన్ చెప్పిన రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి హామీలు అమలు జరిగే విధంగా నిధులు కేటించ లేదు హామీలు అమలు చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే 2026- 2027 రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి హామీలు అమలు చేయాలి అని విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు మేధావులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం లాగానే మాటల గారడి తో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను మోసం చేస్తుంది.అని నేటి విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు మేధావులు గమనిస్తున్నారు.
దామెర కిరణ్ Sfi రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం
