- వరుసగా రెండోసారి ‘ఉప’ పీఠంపై దళిత యువ కిరణం..!
- మండల కేంద్రం పంచాయతీలో బీఆర్ఎస్ యువ నాయకుడు “దైనంపెల్లి సుమన్” ప్రభంజనం
- “గండ్ర” దంపతుల సఫోర్ట్ తో ముందుకు సాగుతున్న “సుమన్”
Youthful energy..! Social revolution : రాజకీయాల్లో యువత పాత్ర పెరగాలని, సేవా దృక్పథం ఉన్నవారికే పట్టం కట్టాలని గ్రామీణ ఓటర్లు మరోసారి నిరూపించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన యువ నాయకుడు “దైనంపెల్లి సుమన్” వరుసగా రెండోసారి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల ఆశీస్సులతో అణగారిన వర్గాల నుంచి ఎదిగొచ్చిన ఒక సామాన్య యువకుడు, తనదైన శైలిలో ముందుకు సాగి అందరి మనసు గెలుచుకుని, వరుసగా రెండోసారి మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, దళిత సామాజిక వర్గం నుండి ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశమవుతోంది.
Youthful energy..! Social revolution..!!
అడ్డంకులను అధిగమిస్తూ….
సాధారణ కుటుంబంలో జన్మించిన ఈ యువ నాయకుడు, గత ఐదేళ్ల పదవికాలంలో తనదైన శైలిలో ముందుకుసాగారు. సామాజిక సమీకరణలతో పనిలేకుండా, అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి, ముఖ్యంగా దళిత వాడలతో పాటు గ్రామమంతటా తమదైన ముద్రవేసుకున్నాడు. బీఆర్ఎస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల ఆశీస్సులతో క్రీయాశీలకంగా ముందుకు సాగుతున్నారు.
Youthful energy..! Social revolution..!!
రెండోసారి ఏకగ్రీవం
ఈసారి జరిగిన ఎన్నికల్లోనూ ఆయన తన పట్టును నిరూపించుకున్నారు. వార్డు సభ్యుల పూర్తి మద్దతుతో, బీఆర్ఎస్ శ్రేణుల సమన్వయంతో రెండోసారి ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒక యువకుడు వరుసగా రెండోసారి ఈ స్థాయికి ఎదగడం మండల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దళిత సామాజిక వర్గం నుండి ఎదిగి, వరుసగా రెండోసారి ఉపసర్పంచ్‌గా గెలుపొందడం అనేది ఒక సామాజిక పరిణామంగా పలువురు భావిస్తున్నారు.
Youthful energy..! Social revolution..!!
గులాబీ నీడలో.. నిత్యం ప్రజా క్షేత్రంలో…
బీఆర్ఎస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని కుయూక్తులు పన్నినా బీలాబీ పార్టీ నీడలో నిత్యం ప్రజాక్షేత్రంలో క్రీయాశీలకంగా సుమన్ పనిచేస్తూ వస్తున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే, స్థానిక నియోజకవర్గం, మండల నాయకులు, సీనియర్ నాయకుల ప్రోత్సాహంతో బీఆర్ఎస్ నాయకునిగా ముందుకుసాగడం సుమన్ నైజాంగా మారింది. ఇదేతరుణంలో తననంటే పలుచనచేసే అభిప్రాయాలు, ఆరోపణలు లేకపోలేదు. అయినప్పటికీ ఒక దళిత యువకుడు వరుసగా రెండుసార్లు ఉపసర్పంచ్‌గా ఎన్నికవ్వడం సామాజికంగా గొప్ప మార్పుకు సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Youthful energy..! Social revolution..!!
కృతజ్ఞతలు తెలిపిన “దైనంపెల్లి సుమన్ “
తన గెలుపుపై ఆయన స్పందిస్తూ.. “తనపై నమ్మకం ఉంచి రెండోసారి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, సహకరించిన వార్డు సభ్యులకు మరియు బీఆర్ఎస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని దైనంపెల్లి సుమన్ ప్రకటించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడమే కాకుండా, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ (BRS)గా నిరంతరం ప్రజల్లో ఉండటం, యువతను సమన్వయం చేయడం, మండల కేంద్రం గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలపడం కోసం తపించే అంశాలే తనను రెండోసారి కూడా ఉప సర్పంచ్ పీఠంపై కూర్చోపెట్టిన అంశాలని తెలిపారు. “సామాజికంగా వెనుకబడిన వర్గం నుండి వచ్చిన తనను, కులమతాలకు అతీతంగా గ్రామస్తులు ఆదరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత విజయం కాదు, ప్రజల నమ్మకానికి దక్కిన గౌరవం. నాపై ఉంచిన బాధ్యతను మరింత కష్టపడి నెరవేరుస్తాను” అని సుమన్ పేర్కొన్నారు.
