
హైదరాబాద్ పిటిఓహెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్న తడక శంకరయ్య
టీజి పోలీస్ గేమ్స్ లో సత్తా చాటిన శంకరయ్య గౌడ్
Yoga winner హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామానికి చెందిన taduka shankaraiah తడక శంకరయ్య తెలంగాణ పోలీస్ గేమ్ లో సత్తా చాటి యోగాలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్, అదేవిధంగా కరాటే పోటీలలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ సాధించారు. ఆయన హైదరాబాద్ పిటిఓ హెడ్ క్వార్టర్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటినుండి కష్టపడి విద్యాబుద్ధులు నేర్చుకొని దాంతోపాటు కొన్ని రోజులు తన కులవృత్తి అయిన గీతావృత్తిలో కూడా పనిచేసి ఉద్యోగం సాధించిన వ్యక్తిగా గ్రామ ప్రజలకు సుపరిచితుడు. హైదరాబాద్ పి టి ఓ హెడ్ క్వార్టర్ నుండి రాష్ట్ర పోలీస్ గేమ్స్ లో పాల్గొని మెడల్స్ పొందారు. ఈయన రాష్ట్రంలో ముఖ్యులకు యోగ గురువుగా కూడా యోగ నేర్పిస్తున్నారు. తడక శంకరయ్యకు యోగాలో మెడల్స్ రావడంతో గ్రామానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు. పోలీస్ అధికారుల సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.