
Oplus_131072
చార్వాక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, సైంటిఫిక్ స్టడీ ఫోరం (SSF), 93472 84111
మహిళలు కేవలం మహిళా దినోత్సవ రోజున ఒక ప్రత్యేక సందర్భంలో ప్రస్తావించాల్సిన వారు కాదు. వారు సమాజ నిర్మాణానికి కీలకమైన శక్తి. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
విజ్ఞాన శాస్త్రం అభివృద్ధిలో మహిళల ప్రాముఖ్యత
శాస్త్ర పరిశోధనలో మహిళల పాత్ర అద్భుతమైన ప్రగతిని సాధించింది. స్త్రీలు ఎదుర్కొన్న ఎన్నో అడ్డంకులను అధిగమించి, విజ్ఞానం మరియు పరిశోధనలో క్రాంతిదారులుగా మారారు.
కొందరు ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు
మెరీ క్యూరీ (Marie Curie) – రేడియోధార్మికత (Radioactivity) పై చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతిని అందుకున్న తొలి మహిళ.రోసాలీన్ ఫ్రాంక్లిన్ (Rosalind Franklin) – డీఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త.కళ్పనా చావ్లా (Kalpana Chawla) – అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మహిళ.అడా లవ్లేస్ (Ada Lovelace) – కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రంగంలో మార్గదర్శకురాలు.టెస్థామస్ (Tessy Thomas) – భారతదేశపు అగ్ని క్షిపణి (Agni Missile) ప్రోగ్రామ్లో ముఖ్య భూమిక పోషించిన శాస్త్రవేత్త.సునీత విలియమ్స్ (SUNITHA WILLIAMS) అంతరిక్ష పరిశోధన కోసం ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉన్న మహిళ వ్యోమగామి.ఈ పరిశోధనలు మహిళలు విజ్ఞాన శాస్త్రాన్ని మరియు అభివృద్ధిని ముందుకు నడిపించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.
సామాజిక ఉద్యమాలలో మహిళలు ఎన్నో పోరాటాలు చేసి విజయాల సాధించారు ముఖ్యంగా…సావిత్రీబాయి ఫూలే గారు భారతదేశంలో మహిళా విద్య కోసం పోరాడిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా భారతదేశ ప్రజల మన్నలను అందుకుంది.రాణి లక్ష్మీబాయి గారు స్వాతంత్ర్య సమరంలో సత్యం కోసం పోరాడిన వీరనారి.మెదా పాట్కర్ – నర్మదా బచావో ఆందోళన ద్వారా సామాజిక న్యాయం కోసం పోరాటం పనిచేసిన మహిళ.మాలాలా యూసఫ్జాయ్ బాలికల విద్యా హక్కుల కోసం పోరాడిన నోబెల్ బహుమతి గ్రహీత. వీరి కృషి ద్వారా, సమాజంలో సమానత్వాన్ని, విద్యను, మానవ హక్కులను కాపాడే ప్రయత్నం ఎంత అవసరమో తెలుస్తుంది.
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర
సమాజ అభివృద్ధికి మహిళలు చేసే కృషి అనేకమార్గాలలో కనిపిస్తుంది. ఉద్యోగస్తులుగా, వ్యవసాయ కార్మికులుగా, శాస్త్రవేత్తలుగా, ఉపాధ్యాయులుగా, నాయకులుగా ప్రతి రంగంలోనూ వారు అత్యంత ప్రభావశీలంగా పని చేస్తున్నారు.
ముఖ్యమైన రంగాలలో మహిళల పాత్ర
1. విద్య – ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా సమాజ అభివృద్ధికి విద్య రంగంలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
2. ఆరోగ్యం – డాక్టర్లుగా, నర్సులుగా, ఆరోగ్య సేవకులుగా మహిళలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.
3. పరిశ్రమ & వ్యాపారం – స్టార్టప్ సంస్థలు స్థాపించి, కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు.
4. రాజకీయ నాయకత్వం – జ్యోతి బసు, ఇందిరా గాంధీ, కమలా హారిస్ లాంటి మహిళలు రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చారు.
5. శ్రామిక మహిళలు – వ్యవసాయంలో, కర్మాగారాల్లో, గృహ ఉత్పత్తుల్లో, స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే మహిళలు నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.
మహిళల లేనిదే సమాజ అభివృద్ధి అసాధ్యం
మహిళలు తల్లి, ఉపాధ్యాయురాలు, శాస్త్రవేత్త, శ్రామికురాలు, నాయకురాలు—ఏ రూపంలో ఉన్నా, సమాజం అభివృద్ధి చెందడానికి వారు అతి ముఖ్యమైన బలమైన మూలస్తంభం. మహిళలు లేకుండా సమాజం ముందుకు వెళ్లలేదు, ఎందుకంటే ప్రతి అభివృద్ధికి వెనుక ఒక మహిళా శక్తి ఉంది.
“విజ్ఞాన శాస్త్రం, సత్యం, సమాజ అభివృద్ధి మహిళల శ్రమతోనే సాధ్యం!”
ఉద్యమాభివందనాలతో…
చార్వాక – ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, సైంటిఫిక్ స్టడీ ఫోరం (SSF). 93472 84111
(మార్చి 8,అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా…)