- డీసీసీ అధ్యక్షులు అయూబ్ మహమ్మద్
- దళితవాడల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- మహిళలతో కలిసి కేక్ కట్ చేసిన జిల్లా కాంగ్రెస్ సారథి
Women empowerment is the goal of Congress : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు అన్ని రంగాల్లో రాణించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయూబ్ మహమ్మద్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వరంగల్ నగరంలోని పలు దళితవాడల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల మధ్యకు వెళ్లిన ఆయన, వారితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయూబ్ మహమ్మద్ మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు అబలలు కాదని, సబలలని నిరూపిస్తూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. మహిళా సాధికారతకు, వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మహిళల హక్కుల కోసం, రక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని భరోసా ఇచ్చారు. దళితవాడల్లోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు జన్ను ప్రమీల, జన్ను జయ, జన్ను ప్రభ, గోడిశెల వినోద, ఇమ్మడి సరోజ, మాధాసి పద్మలతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
