
- కలకలం రేపుతున్న ఏడిఈ అక్రమ ప్రమోషన్ వ్యవహారం.. అక్రమాస్తుల ఆరోపణలు ..!
- గతంలో జైలుకు వెళ్లి వచ్చినా అదే పోస్టులో దర్జాగా ఉద్యోగం…
- కొడుకు ఓ మంత్రి ఓఎస్డి కావడం అసోసియేషన్ నాయకుడికి కలిసొచ్చేనా..?
Will irregularities be buried with the retirement of “ADE” : విద్యుత్ శాఖలో అసోసియేషన్ నాయకుడిగా ఉన్న ఆ ఏడీఈ అక్రమంగా ప్రమోషన్ పొందాడని, బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకొని పనులు పూర్తికాకముందే బిల్లులు చెల్లింపు అయ్యేలా పావులు కదిపాడని ,అక్రమంగా అనేక ఆస్తులను సంపాదించి బినామీ పేర్లపై ఉంచాడని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అదే పోస్టులో కొనసాగిన ఈ అధికారి రిటైర్మెంట్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నిసంవత్సరాలుగా విద్యుత్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడి అక్రమంగా ప్రమోషన్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి అక్రమ లీలలు రిటైర్మెంట్ తో సమాధి అవుతాయా లేక ఉన్నతాధికారులు సదరు అధికారి పై విచారణ చేసి చర్యలు తీసుకుంటారా? లేదా అనే విషయం ఇప్పుడు ఎన్పీడిసిఎల్ పరిధిలో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.
Will irregularities be buried with the retirement of “ADE”
- అసలేంజరిగింది…?
విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి తన తండ్రి చనిపోయిన అనంతరం 1981 లో హెల్పర్‌గా ఉద్యోగంలో చేరి తర్వాత లైన్ మెన్ గా 1991 సంవత్సరం వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. అదే సంవత్సరం సబ్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొందిన ఈయన మరో 5 సంవత్సరాల్లోనే ఏఏఈ గా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఏఏఈ గా 13 సంవత్సరాలు కొనసాగిన సదరు అధికారి ఎవరూ ఊహించని రీతిలో 2009 లో ఏడిఈ గా పదోన్నతి పొందడం అప్పట్లో సంచలనంగా మారింది. అసలు విషయం ఏమిటంటే ఈ అధికారి 1981 నుండి 1991 వరకు ఉద్యోగం చేస్తూనే కరెస్పాండెన్స్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా సర్టిఫికెట్ పొందినట్లు ఆరోపణలు ఉండడం గమనార్హం.
Will irregularities be buried with the retirement of “ADE”
- ఏడిఈ అక్రమాలు…
అసోసియేషన్ లీడర్ గా కొనసాగుతున్న ఈ అధికారి సబ్ ఇంజనీర్ లను, ఏఏఈలను, ఏఈ లను మరికొంత మంది ఉద్యోగులను సైతం భయబ్రాంతులకు గురిచేసి అందినకాడికి దండుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సదరు అధికారి ఏఏఈ గా గీసుగొండ మండలంలోని ఓ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అనేక అవకతవకలకు పాల్పడగా విజిలెన్స్ అధికారులు విచారణ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకున్న పలుకుబడి ఉపయోగించిన ఈ అధికారి సస్పెండ్ కాకుండా కొంతమంది ఉన్నతాధికారులనే బ్లాక్ మెయిల్ చేశాడని విద్యుత్ శాఖలోని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాకుండా 2018 లో జరిగిన సబ్ ఇంజినీర్ పోస్టుల నియామకాల్లో సుమారు 60 కి పైగా పోస్టులను విద్యుత్ శాఖలో విధులు నిర్వహించే కార్మికులకు 5 నుండి 8 లక్షల రూపాయల వరకు తీసుకుని వారికి పదోన్నతి కల్పించినట్లు మాతృశాఖ ఉద్యోగులే ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో అప్పటి “సిఎండి”కి ఈ వ్యవహారంలో గట్టిగానే ముట్టజెప్పానని ఈ అధికారి బహిరంగంగానే ప్రచారం చేసుకున్నాడని సమాచారం. అసోసియేషన్ నాయకుడిగా కొనసాగుతున్న సదరు అధికారి అక్రమంగా అనేక ఆస్తులను కూడబెట్టి తన బినామీ పేర్లపై ఉంచాడని ప్రచారం జరుగుతోంది.
Will irregularities be buried with the retirement of “ADE”
గత ప్రభుత్వం చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో ఈయన స్వలాభం కోసం ఓపెన్ ప్లాట్లల్లో విద్యుత్ స్తంభాలు , ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసిన ఈయన కొన్ని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.అంతటితో ఆగని ఈ అధికారి తన స్వలాభం కోసం ప్రకాష్ రెడ్డి పేట లోని ఖాళీ స్థలాల్లో పోల్స్ కూడా వేయించారట. ఖాళీ ప్లాట్లకు ఎక్స్టెన్షన్ పోల్స్ వేసి దానికి లంచంగా ఒక ప్లాటు కూడా గిఫ్ట్ గా పొందినట్లు ఈ అధికారిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ అధికారికి బినామిగా ఉండే కాంట్రాక్టర్లు చేసిన పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ బిల్లులు సైతం ఇప్పించినట్లు ప్రచారం లేకపోలేదు.
Will irregularities be buried with the retirement of “ADE”
గత కొన్నిసంవత్సరాలుగా ఓ వెలుగు వెలిగిన సదరు ఏడిఈ అక్రమంగా అనేక ఆస్తులను బినామీ పేర్లతో కూడబెట్టినట్లు ఎన్పీడిసిఎల్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో కోడలి కేసులో జైలుకు వెళ్లిన ఈ అధికారిని తిరిగి అదే పోస్టులో దర్జాగా కొనసాగించారంటే సారు పలుకుబడి ఎలా ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. రిటైర్మెంట్ కు సిద్ధంగా ఉన్న ఈ అధికారి అసోసియేషన్ నాయకుడు కావడం ఆయన కొడుకు ఓ మంత్రికి ఓఎస్డీగా ఉండడంతో తన పలుకుబడి అమాంతం పెరిగిపోయిందని విద్యుత్ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
Will irregularities be buried with the retirement of “ADE”
- అసలు ఆ ఏడిఈ జైలుకు ఎందుకు వెళ్లారు..?
- హెల్పర్ నుండి ఏడిఈ గా ఎలా పదోన్నతి పొందారు..?
- మాజీ సిఎండి కి ఈ అధికారి ఉన్న లింక్ ఏంటి…?
- ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకునేనా…?
- మంత్రి ఓఎస్డీ మాయ చేసేనా..?
మరో సంచికలో….