- తెలంగాణ ఉద్యమం – చారిత్రక నేపథ్యం
When will there be light in the lives of Telangana activists : తెలంగాణది ఒక దీర్ఘకాలిక ప్రజా ఉద్యమం. అది కేవలం రాజకీయ ఉద్యమం కాదు, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక దోపిడీ, సాంస్కృతికపరమైన వివక్షతల నుండి రూపుదిద్దుకుంది. నాటి కాకతీయుల నుండి, నిజం రాజుల దాకా శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన తెలంగాణ నేల, ఉద్యమాల పురిటి గడ్డగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అణిచివేతల నుండి , అవమానాల నుండి పుట్టిన ఈ నేలలో తిరుగుబాటుతత్వం ఉంది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన *సమ్మక్క- సారలమ్మ* మొదలుకొని అసఫ్ జాహీలకు సవాల్ విసిరి, గోల్కొండ నవాబుల కోటలను బద్దలు కొట్టి, గోల్కొండ ఖిల్లా పైన బహుజన జండా పాతిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, జల్, జంగిల్ ,జమీన్, ఆదివాసుల స్వయంపాలన కొరకు జంగ్ సైరన్ మ్రోగించి బ్రిటిష్, నిజాం సేనలతో పోరాడిన కొమురం భీం ల వరకు ఎందరో వీరుల అమరత్వపు జాడలు ఉన్నాయి. అంతేకాదు భూమికోసం, బుక్తికోసము, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం దొర భూస్వాములు , నిజాం రజాకారులతో రణం చేసి, బరిగిసి కొట్లాడిన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల త్యాగాల బాటలో తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం(1948) మొదలుకొని సీమంద్ర వలసాధిపత్యానికి, ఆంధ్ర దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా, 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలర్పించిన 370 మంది తెలంగాణ బిడ్డల తెగువతో పాటు, 1996 నుంచి జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరియు 2009 నుండి 2014లో తెలంగాణ ఆవిర్భావం వరకు 1200 మంది విద్యార్థుల బలిదానుల తో నిర్మించుకున్న చరిత్ర తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి, అస్తిత్వానికి ప్రత్యేకము అని చెప్పవచ్చు.
When will there be light in the lives of Telangana activists?
- నిజాం పాలన…
తెలంగాణ ప్రాంతం (1724-1948) హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. భూస్వామ్య వ్యవస్థ పటిష్టంగా కొనసాగేది. వెట్టిచాకిరి, ప్రజల్లో నిరక్షరాస్యత ఎక్కువ. పటేల్ , పట్టు వారి , జాగిర్దారి వ్యవస్థ ప్రజలను పన్నుల ద్వారా ఆర్థికంగా దోపిడీ జరిగేది. నిజాం పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ ఉర్దూపాలన భాషగా (అధికార) కొనసాగేది. తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు (1948) తర్వాత, భారత స్వాతంత్ర్యనంతరం నిజాం ప్రభువు *ఆపరేషన్ పోలో* ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అయితే (1948 – 56) తెలంగాణ ప్రాంతం స్వతంత్రంగా ప్రత్యేక పాలన సాగింది. భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. (1956). ఈ విలీనానికి ముందు తెలంగాణకు కొన్ని సేఫ్ గాడ్స్ ( భద్రత నిబంధనలు) ఇవ్వబడ్డాయి..
When will there be light in the lives of Telangana activists?
- ముల్కి నియమాలు
నీళ్లు నిధులు ,నియమకాలలో న్యాయంగా చేస్తామని పేర్కొనడం జరిగింది. కానీ మరునాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ముల్కీ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా, వారి మోసపూరిత వైఖరిని ప్రదర్శించారు. దానికి నిరసనగా పుట్టిందే “జై తెలంగాణ ఉద్యమం”. 1969లో ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉద్యోగులు ముందు వరుసలో ఉండి నడిపారు. ఈ ఉద్యమంలో దాదాపు 370 మంది ప్రాణాలు కోల్పోయారు. తధానంతరం ముల్కీ రూల్స్‌ను రద్దుచేసి ఆరు సూత్రాలు, పెద్దమనుషుల ఒప్పందాలు వంటి చర్యలు చేపట్టారు. కానీ అవి కూడా తెలంగాణ ప్రాంత సమస్యలను పరిష్కరించలేదు. ఆంధ్ర దోపిడీ ఆగలేదు. అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కిన ఆంధ్ర పాలకులు తెలంగాణపై మరింత నిర్బంధాన్ని ఎక్కుపెట్టి, ఉక్కు పాదం మోపారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన, విద్యా ఉద్యోగ , ఉపాధి అవకాశాల్లో నిర్లక్ష్యం, వివక్షతోపాటు అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబాటు కొనసాగింది. ఫలితంగా మళ్లీ తెలంగాణ వాదం బలపడింది. మలిదశ తెలంగాణ పోరాటం 1996 విప్లవ పంథాను తీసుకుంది. దాదాపు 1996 మొదలుకొని 2001 వరకు ప్రతి రోజు ఎన్కౌంటర్లతో తెలంగాణ పల్లెలు మేల్కున్నాయి అంటే ఆశ్చర్యం కాదు. అట్లా 1997, 98లలో మారోజు వీరన్న, బెల్లి లలిత, ఐలన్న, నల్ల వసంత లాంటి ఎంతో మంది అమరులు త్యాగాలతో తెలంగాణ పోరాటం మరింత ఎరుపు ఎక్కింది. మారోజు వీరన్న ఆధ్వర్యంలో 1997 సూర్యపేట డిక్లరేషన్ తెలంగాణ మహాసభలో లక్షల మంది తెలంగాణ వాదులు పాల్గొనీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను తెలియజేశారు. అలాగే అమరుడు సాయిబాబా ఆకుల భూమన్న తదితరుల నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్ సభ, కామ్రేడ్ గద్దర్ ఆధ్వర్యంలో భువనగరి సభ ఏర్పాటు చేయబడింది. లక్షలాది మంది తెలంగాణ ప్రజల మధ్య తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తెలియజేయడం జరిగింది. అయితే అటు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమకారులను అణిచివేయడం కోసం తెలంగాణ పల్లెలపై నిర్బంధాన్ని ఎక్కుపెట్టి పారా మిలిటరీ బలగాలను దించి నిత్యం నెత్తురులను పారించారు. ఎంతోమంది తెలంగాణ యువకులను నక్సలైట్ల పేరుతో అరెస్టులు చేసి, చిత్రహింసలు పెట్టి జైలల్లో నిర్బంధించారు. బూటకపు ఎన్కౌంటర్లు చేసి తెలంగాణ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. తెలంగాణ నిత్యం అగ్ని గుండంగా మార్చారు.
When will there be light in the lives of Telangana activists?
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు
2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. అప్పటివరకు ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతున్న పోరాటానికి ఒక రాజకీయ రూపం సంతరించుకుంది. ఉద్యమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ ప్రవేశం తెలంగాణ ఉద్యమం రాజకీయంగా ముందడుగు వేయించింది. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఒక బలమైన శక్తిగా తెలంగాణ వాదాన్ని అసెంబ్లీలో వినిపించడానికి దోహదం జరిగింది. ఓవైపు నీళ్లు ,నిధులు నియమకాలతో మలిదశ పోరాటం కొనసాగుతున్న సందర్భంలో శతబ్ధాల చరిత్ర కలిగినటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాప కింద నీరు లాగా సమైక్య పాలకులు అంతరించేలా చేసిన సందర్భంలో వాటి పరిరక్షణ కోసమే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమమూలో 2009 కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పింది. యావత్ తెలంగాణ సమాజం రోడ్లమీదకి వచ్చేలా చేసి విద్యార్థులు ,ఉద్యోగులు, మహిళలు సబ్బండ కులాలు సకల జనులు ఛలోఅసెంబ్లీ , మిలియన్ మార్చ్, సాగరహారం, రైలు రోకో, సకలజనుల సమ్మె, దీక్షలు ,ధర్నాలు , మహా పాదయాత్రలు, రాస్తారోకోలతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. గత్యంతరం లేని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ప్రారంభిస్తామంటూ, ప్రకటించేలా చేసింది.
2009 మొదలుకొని 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు నిరంతరం ఉద్యమాన్ని రగిలించిన విద్యార్థుల( 1200 మంది) ఆత్మ బలిదానాలతో జూన్ 2 2014న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.
When will there be light in the lives of Telangana activists?
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం- – దశాబ్ద పాలన
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ స్వరాష్ట్రము లో ఉద్యమ పార్టీ అయినా టిఆర్ఎస్ తొలి విడత జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే మొదట దళితుడే తొలి సీఎం అన్న కేసీఆర్ మాట మార్చి తానే అధికార పీఠాన్ని అధిష్టించడం అటు దళితులను ఇటు ఉద్యమ శ్రేణులను నివ్వెరపరిచింది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అనేక ప్రజా ఆకర్షక పథకాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మద్దతును పొందాడు. రైతుబంధు , మిషన్ భగీరథ మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి ,ఆసరా పింఛన్లు లాంటి అనేక పథకాలు కేసీఆర్ రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నడిపించాయి. రెండవసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూమ్, ధరణి పోర్టల్ ,దళిత బంధు లాంటి నిర్ణయాలు బంగారు తెలంగాణ పేరుతో చేయడం జరిగింది. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దశబ్ద కాలంలో ఆరు లక్షల కోట్ల అప్ప లకు కూరుకుపోయింది. తెలంగాణ యువతకు విద్య, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. కేజీ టు పీజీ ఉచిత విద్య నినాదప్రాయమై అనేక స్కూల్లో రేషనలైజేషన్ పేరుతో మూసివేతకు గురైనాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో ఏర్పాటు, ఉద్యోగుల నోటిఫికేషన్లలో లోపాలు, విద్యార్థి నిరుద్యోగుల్లో నిరాశను కలిగించాయి. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. రైతులు ,నిరుద్యోగులు, ఆత్మహత్యలకు పూను పోవడమే కాకుండా దశబ్ద కాలం పాటు ఉన్న కేసీఆర్ పాలనకు ఉద్యమకారూలంత ఏకతాటిపై వచ్చి చరమగీతం పాడారు.
When will there be light in the lives of Telangana activists?
- తెలంగాణ ఉద్యమకారులు – సమస్యలు
తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయని ఆశించి చదువులు, ఉద్యోగాలు విడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ముందు వరుసలో ఉండి ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక కేసులు, నిర్బంధాలు, జైలు జీవితం అనుభవించిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదు. దశబ్ద బిఆర్ఎస్ పాలనలో కానీ , నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగింది ఏమీ లేదు. మొదట్లో కేసీఆర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. కానీ 1200 మంది అమరుల కుటుంబాలు కేవలం 400 మంది కుటుంబాలకే సహాయాన్ని అందించడం జరిగింది. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో 6 గారంటీలను ప్రకటించింది ఆరు గారంటీలోని ఒకటిగా ఉద్యమకారుల సంక్షేమన్నీ చేరుస్తూ అందులో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, ఉద్యమకారులకు పింఛన్లు కల్పిస్తామని ప్రత్యేకంగా ఒక కాలాన్ని కేటాయించి, అప్లికేషన్లను తీసుకుంది. కానీ నేటికీ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టకపోవడం తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని కలిగిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు అన్ని జిల్లాలలో ఉద్యమకారుల JAC ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామ లలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఉద్యమకారుల డిమాండ్స్ ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించ దాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం కేటాయించాలని అనే నినాదంతో జిల్లాలో మొదలైన భూ పోరాటాన్ని అన్ని జిల్లాల్లో తీవ్రతలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు జిల్లాల వారీగా ఉద్యమకారూలతో సమావేశాలు నిర్వహించి కార్యచరణ ప్రకటించాలి కార్యచరణ ప్రకటించాలి.
When will there be light in the lives of Telangana activists?
- తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్
మలిదశ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుల జీవితాలను బాగు చేయాలంటే ఉద్యమకారులను గుర్తించదానికి సంబంధించిన ఒక ఉద్యమకారుల కమిషన్ ఏర్పాటు చేసి, అందులో….
1 ). తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, గుర్తింపు కార్డులతో పాటు హెల్త్ కార్డులను జారీ చేయాలి.
2 ). ఉద్యమకారులకు తక్షణమే 250 గజాల ఇంటి స్థలంతో పాటు నాలుగదుల ఇంటిని నిర్మించి ఇవ్వాలి.
3) తెలంగాణ ఉద్యమకారులకు ప్రతినెల ప్రస్తుత ఖర్చుల దృష్ట్యా 25 వేల రూపాయల పింఛను అందివ్వాలి.
4 ). తెలంగాణ అమరుల కుటుంబాలకు పదిలక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
5). తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులతో పాటు టిఆర్ఎస్ పాలనలో ఉద్యమకాళ్లపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.
6 ). ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరుల స్థూపాన్ని స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలి.
7 ). తెలంగాణ ఉద్యమకారులకు విద్యా ఉద్యోగ లలో 5 శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి.
8 ). తెలంగాణ ఉద్యమకారులకు స్వయం ఉపాధి కింద వ్యాపారాలు లేదా పరిశ్రమలు నెలకొల్పుకొనుటకు అవకాశం కల్పిస్తూ 50 శాతం సబ్సిడీతో కూడిన కోటి రూపాయల బ్యాంకు రుణాలను అందించాలి.
9 ). తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్‌ను కేటాయించాలి
10 ). పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ పూర్తి చరిత్రను ఒక సబ్జెక్టుగా చేర్చాలి. ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ అమరుల స్మారకార్థం గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారుల ఉద్యమ సమయంలోని పోరాటాల ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయాలి.
- కంచర్ల బద్రి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు
