
- రియాజుద్దీన్ రాకతో గీసుగొండ మండలంలో నాలా కన్వర్షన్ ల జోరు
- గత తహశీల్దార్ లు చేయని కన్వర్షన్ లు ప్రస్తుత తహశీల్దార్ చేయడం వెనుక మతలబేంటో?
- వరంగల్ జిల్లా కలెక్టర్ విచారణ చేస్తే తహశీల్దార్ బండారం బయటపడే అవకాశం అంటూ జిల్లాలో జోరుగా ప్రచారం?
What is the secret behind the crossword conversions : వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో 15 నెలల కాలంలో జరిగిన నాలా కన్వర్షన్ ల వ్యవహారం ఇప్పుడు అటు రెవెన్యూశాఖ తో పాటు కలెక్టర్ కార్యాలయం లో కూడా హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రియాజుద్దీన్ ఎడాపెడా అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారిగా కన్వర్షన్ చేయడం వెనుక మతలబు ఏమయ్యుంటుందోనని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సదరు తహశీల్దార్ ఈ మండలానికి రాకముందు పదుల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు జరుగగా ఈ తహశీల్దార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వందల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు జరగడం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నట్లు సమాచారం. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)అనుమతి లేకుండా మండలలో అనేక వెంచర్ లు ఏర్పడగా అందులోని ప్రతి ప్లాటును సదరు తహశీల్దార్ నాలా కన్వర్షన్ చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
What is the secret behind the crossword conversions
- కలెక్టర్ విచారణ చేస్తే తహశీల్దార్ కన్వర్షన్ ల వ్యవహారం బట్టబయలు కానుందా..?
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో సుమారు 15 నెలల కాలంలో జరిగిన నాలా కన్వర్షన్ లపై జిల్లా కలెక్టర్ విచారణ చేస్తే కనుక తహశీల్దార్ బండారం బట్టబయలు అవుతుందని తెలుస్తోంది. హన్మకొండ జిల్లా దామెర మండల తహశీల్దార్ గా విధులు నిర్వహించిన రియాజుద్దీన్ 2023 శాసన సభ ఎన్నికల ముందు గీసుగొండ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రియల్టర్ లు చేసిన నాన్ లేఅవుట్ వెంచర్ లను పరోక్షంగా ప్రోత్సహిస్తూ అందులోని ప్లాట్లను గజాల వారిగా కన్వర్షన్ చేసి ఇప్పటికే పెద్దమొత్తంలో లక్షల రూపాయలను కొల్లగొట్టినట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.తహశీల్దార్ రియాజుద్దీన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన నాలా కన్వర్షన్ లను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తే కన్వర్షన్ ల బండారం బయట పడే అవకాశం ఉందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం.
What is the secret behind the crossword conversions
ఒక్కో కన్వర్షన్ కు ముట్టిందెంత..? తహశీల్దార్ చేసిన నాలా కన్వర్షన్ లు ఎన్ని..? అనుమతి లేని వెంచర్ లు ఏ గ్రామ పరిధిలో ఉన్నాయి..సర్వే నెంబర్ ల వారిగా సంచలన కథనం….మీ జన నిర్ణయం పత్రికలో..