కదలని ఫైళ్లు.. నిమ్మకు నీరెత్తిన యంత్రాంగం..!
ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోని వరంగల్ కలెక్టరేట్ అధికారులు…
నకిలీ సర్టిఫికేట్‌తో అక్రమ ఉద్యోగంపై పలు సంఘాల ఆగ్రహం..
తక్షణమే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్…
What are the actions taken against MGM’s ‘fake’ deal..!? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బ్యాక్లాగ్ నియామకాల్లో జరిగిన భారీ అక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ దివ్యాంగ ధ్రువపత్రంతో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు, దివ్యాంగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
What are the actions taken against MGM’s ‘fake’ deal..!?
అసలేం జరిగిందంటే..?
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ముసుకు కృష్ణ (తండ్రి: వీరమల్లు) అనే వ్యక్తి టైపిస్టుగా, ప్రస్తుతం పెన్షన్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఇతడు 25-12-2010న జారీ అయిన సదరం (SADAREM) సర్టిఫికేట్‌ను అడ్డం పెట్టుకుని, తాను దివ్యాంగుడినని నమ్మించి అక్రమంగా ఉద్యోగం పొందాడని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇతడు దివ్యాంగుడు కాదని, ఫోర్జరీ పత్రాలతో అసలైన దివ్యాంగుల పొట్ట కొట్టాడని ఎంఆర్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP), వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) నాయకులు ఆధారాలతో కలెక్టర్‌కు విన్నవించారు.
What are the actions taken against MGM’s ‘fake’ deal..!?
అధికారుల ఉదాసీనతపై మండిపాటు
ఈ అక్రమ నియామకంపై గతంలోనే వరంగల్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. అధికారులు కేవలం లేఖలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ముసుకు కృష్ణకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని నాయకులు ప్రశ్నిస్తున్నారు. సదరు వ్యక్తి ప్రస్తుతం పదోన్నతుల కోసం కూడా ప్రయత్నిస్తుండటం విడ్డూరంగా ఉందని వారు పేర్కొన్నారు.
What are the actions taken against MGM’s ‘fake’ deal..!?
‘ముసుగు’ తొలగించాల్సిందే..!
ఈ సందర్భంగా ఎంఎస్పీ రాష్ట్ర నేతలు బిర్రు మహేందర్ మాదిగ, తడుగుల విజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ, బాబురాజు యాదవ్, కన్నెబోయిన ప్రమోద్ మాట్లాడుతూ.. “నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందడం వల్ల చదువుకున్న అసలైన దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ముసుకు కృష్ణ ధ్రువపత్రాలను రీ-వెరిఫికేషన్ చేయాలి. ప్రత్యేక వైద్య బృందంతో అతని శారీరక స్థితిని తనిఖీ చేయాలి” అని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో దివ్యాంగుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
