
Welfare board demand in hamali leburs హమాలీ కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల తరహా (కేరళ రాష్ట్రం) సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పైబడిన వారికి పదివేల రూపాయల పెన్షన్ ప్రమాద బీమా సౌకర్యం ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులు ఇందిరమ్మ ఇండ్ల హమాలీలకు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ బొట్ల చక్రపాణిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….జిల్లాలో వివిధ రంగాలలో 8వేల మంది హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు రోజుకు 10 నుండి 12 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు చేస్తున్నారు. హమాలిలు నిత్యం బరువులు మోయడం వల్ల శరీరం బండ పారిపోతుంది. నడుములు వంగిపోతున్నాయి. నరాలు చచ్చుపడిపోతున్నాయి. దుమ్ము, ధూళి,గాలి వెలుతురులేని గోదాములలో పనిచేయడం వల్ల ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడుతున్నారు. పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేకమంది హమాలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాయాలపాలై కాళ్లు, చేతులు, విరిగి మంచాలకు పరిమితమైన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధిక బరువులు మోయడం వలన 50 సంవత్సరాలకే ముసలి వారు అవుతున్నారు కూర్చోవాలన్నా, నిలబడాలన్న నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వానికి హమాలీల పని (ఎగుమతులు దిగుమతులు) ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న హమాలీల సంక్షేమం కోసం నయా పైసా వీరి సంక్షేమం కోసం ఖర్చు పెట్టకపోవడం అన్యాయం. కాబట్టి హమాలీ కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల (కేరళ రాష్ట్రం) తరహా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తే హమాలీ కార్మికులకు ప్రమాదాలు జరిగిన,భార్య డెలివరీ అయిన,బిడ్డ పెళ్లిళ్లు చేసిన ,గాయాలైన కాళ్లు, చేతులు విరిగిన, హస్పటల్ పాలైన ,మరణించిన ,పిల్లల చదువులకు ఆర్థిక సాయం లాంటివి అందుతాయి వీటికి ప్రభుత్వం పైన నయా పైసా భారం పడదు.కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని 2008 సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని 50 సంవత్సరాలు పైబడిన హమాలీలకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అన్ని రకాల హమాలీలకు ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డు, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యవసాయ మార్కెట్, బేవరేజ్,ఏఎంసీ మార్కెట్, ఐకెపి ,ఎఫ్సిఐ , సివిల్ సప్లై ,ఎలక్ట్రిసిటీ రైల్వే ఆర్టీసీ కార్గో హమాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని,హమాలీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పది లక్షలతో ఇండ్ల నిర్మాణం చేయాలని ఐకెపి హమాలీలకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి తాడుకట్టు మామూలు ఇవ్వాలని ప్రతి హమాలి కూటుకు రెండు గుంటల స్థలం ఇచ్చి ఆఫీస్ నిర్మాణం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*అనంతరం జిల్లా జెసి గారికి వినతి పత్రం అందజేశారు ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు*
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కారు ఉపేందర్ ఆలకుంట యాకయ్య హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు సంగాల మొగిలి నాయకులు విజేందర్ ఆదాం తిరుపతి స్వామి కుమారస్వామి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.