
Warangal district nallabelly mandal బీజేపీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ సూచన మేరకు సేవా పక్షం నల్లబెల్లి మండల కార్యశాల పార్టీ కార్యాలయంలో సేవా పక్షం అభియాన్ మండల కన్వీనర్ ఈర్ల నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ…సెప్టెంబర్ 17 మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జన్మదినం వరకు జాతీయ పార్టీ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా 15 రోజులు మహనీయుల జన్మదిన పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, మొక్కలను నాటడం, స్వచ్ఛభారత్ లాంటి సేవా కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవంగా సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరడం జరిగింది.అదే రకంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం పంపిన యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించి రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నది రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు.కేంద్రంనుంచి రావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు మూడు వేలకోట్ల రూపాయలు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే స్ధానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పర్వాతలు,మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,మండల కార్యదర్శి మర్రి నాగరాజు,సేవా పక్షం అభియాన్ మండల కో కన్వీనర్లు మురికి మనోహర్, తిమ్మాపురం శివ,సీనియర్ నాయకులు నాగిరెడ్డి రాజిరెడ్డి,మండల నాయకులు ములుక రాజేష్,గుగులోతు రాందాన్,నాగపూరి సాగర్, ఓదెల అశోక్,దేవేందర్,రాపర్తి అనిల్, కౌడగాని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.