
- కోచింగ్ సెంటర్ పేరుతో కొత్తరకం విద్యావ్యాపారం..!
- “వేదాంతు” జూనియర్ కాలేజీ కాదట..!!
- విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందనే టాక్…
- గతంలో ఓ కాలేజీపై విద్యార్థి సంఘ నాయకులు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన చర్యలు శూన్యంగా మారిన వైనం…
- “వేదాంతు”పై చర్యలు ఉంటాయా లేదా అని ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు…
- కోచింగ్ సెంటర్ అయితే ఇంటర్ విద్యార్థులను ఎందుకు చేర్చుకుంటున్నట్లో….
- విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్న “వేదాంతు” యజమాన్యం..
- ఇంటర్ అడ్మిషన్ల కోసం జిల్లా మొత్తం తిరుగుతున్న “వేదాంతు” పిఅర్ఓలు…
- “వేదాంతు” కోచింగ్ సెంటర్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి సంఘ నాయకులు…
- “వేదాంతు”పై డిఐఈఓ ఆఫీసులో ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘం నాయకులు…
“Vedanthu” is running a new type of education business under the name of a coaching center : హనుమకొండ నగరంలోని “వేదాంతు” జూనియర్ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రత్యేకంగా పిఆర్ఓలను నియమించుకొని అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టి సీటు రిజర్వ్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలోనే జేఈఈ నీట్ లో “వేదాంతు” ఉపాధ్యాయులు టాప్ అంటూ హనుమకొండలో వేదంతు లెర్నింగ్ సెంటర్ పేరుతో కొత్త దందాకు తెరలేపారనే ప్రచారం సాగుతోంది. విద్య వ్యాపారులు నీట్, జేఈఈ మెయిన్స్ పేరుతో అందిన కాడికి దోసుకునేందుకు సిద్ధపడుతున్నారనటానికి ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు వేదాంతు లెర్నింగ్ సెంటర్ జూనియర్ కాలేజ్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులే వేదాంతుకు సహకరిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇట్టి విషయంలో డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ డిఐఈఓ ఆఫీస్ లో ఫిర్యాదు కూడా చేయడం గమనార్హం. జేఈఈ నీట్ లెర్నింగ్ సెంటర్ పేరుతో జూనియర్ కాలేజీ నిర్వహిస్తున్న వేదాంతు జూనియర్ కాలేజీ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరినట్లు డీఎస్ఏ జిల్లా అధ్యక్షులు శివ పేర్కొన్నారు. “వేదాంతు” జేఈఈ నీట్ కోచింగ్ సెంటర్ అయితే “వేదాంతు” పిఆర్వోలు జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు వేదాంతు పేరుతో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించాడు. వేదాంతు పేరుతో బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేస్తున్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ అనుమతులు లేని “వేదాంతు” జూనియర్ కళాశాలలను సీజ్ చేయాలి : ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున
రాష్ట్ర విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా హనుమకొండ నగరంలో “వేదాంతు” జేఈఈ నీట్ లెర్నింగ్ సెంటర్ పేరుతో జూనియర్ కాలేజీ నిర్వహిస్తున్న “వేదాంతు” కళాశాలలను సీజ్ చేసి ఆ యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
వేదాంతు జేఈఈ నీట్ లెర్నింగ్ సెంటర్ పేరుతో జూనియర్ కళాశాల ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా, పెద్ద పెద్ద హోర్డింగులు ప్లెక్సీలు బ్రోచర్లు వేస్తూ విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతున్నది. పేరుకు అకాడమీలని చెప్పుకుంటూ విద్యాశాఖ కండ్లు గప్పి జూనియర్ కళాశాలలు నిర్వహించడం నిబంధనలను తుంగలో తొక్కడమే. కళాశాల పర్మిషన్ లేకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కళాశాలలు నిర్వహిస్తూ, అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు లక్షలలో వసూలు చేస్తున్న వేదాంతు యాజమాన్యంపై విచారణ చెపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకొవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ కళాశాలలను సీజ్ చేయాలి.