
- అనుమతులు లేకుండా ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటున్న “వేదాంతు” పై చర్యలు తీసుకోవాలి
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు ఆరేగంటి నాగరాజు గౌడ్
- వేదాంతు కోచింగ్ సెంటర్ పేరుతో మోసం చేస్తున్న యాజమాన్యంపై చర్యలు చేసుకోవాలి : డిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్
“Vedanthu” college..? A coaching center..? : హనుమకొండ నగరం నడి ఒడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా వేదాంతు లెర్నింగ్ సెంటర్ పేరుతో ప్రచారం చేస్తూ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేస్తూ వేదాంతుకు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అనుమతులు వచ్చే అవకాశం లేకున్నా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న వేదాంతు జూనియర్ కాలేజి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని? విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
“Vedanthu” college..? A coaching center..?
వేదాంతు లెర్నింగ్ సెంటర్ పేరుతో తప్పుడు ప్రచారంతో జూనియర్ కాలేజీ అడ్మిషన్లు తీసుకుంటున్న వేదాంతు యజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని, నగరంలో అనుమతులు లేకుండా పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను జూనియర్ ఇంటర్లో చేర్చుకుంటు పిఆర్వోలను పెట్టి అనుమతులు ఉన్నాయని వరంగల్ జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ చేస్తూ నైపుణ్యం కలిగిన విద్యార్థులకు 90 శాతం వరకు ఫీజులో రాయితీ ఉంటుందని తప్పుడు ప్రచారం చేస్తూ బయటకు మాత్రం మాది జూనియర్ కాలేజ్ కాదు కోచింగ్ సెంటర్ అంటూ విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వేదాంతు జూనియర్ కాలేజ్ కానప్పుడు పదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఎందుకు చేర్చుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు వేదాంతు జేఈఈ నీట్ కోచింగ్ పేరుతో ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా 50 కి పైగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది వీఆర్వోలకు టార్గెట్ ఇస్తూ ప్రతి అడ్మిషన్ పై పర్సంటేజ్ లు ఇస్తూ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి వేదాంతు జూనియర్ కాలేజ్ తన పిఆర్వోలను రంగంలోకి దింపింది కాలేజీ యజమాన్యం మాత్రం మాది అంత కోచింగ్ సెంటర్ అంటూ నీతి ముచ్చట్లు చెప్తున్నారు కోచింగ్ సెంటర్ అయితే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఎందుకు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి గతంలో కూడా రాజస్థాన్ కోటా పేరుతో అడ్మిషన్లు తీసుకొని మాది కోచింగ్ సెంటర్ అని నీతి ముచ్చట్లు చెప్పినా ఒక్క కాలేజీ తీర ఎగ్జామ్స్ టైం కి అమ్మాయిలను ఒక కాలేజీ నుంచి అబ్బాయిలు నొక్క కాలేజీ నుంచి ఎగ్జామ్స్ రాయించిన పరిస్థితి హనుమకొండ నగరంలో కనిపిస్తుంది
నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ లలో నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తుంటే, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఎందుకు స్పందించడం లేదని ప్రవేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న వేదాంతు జూనియర్ కాలేజీ జేఈఈ నీట్ లెర్నింగ్ కోచింగ్ సెంటర్ పేరుతో విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులను కోచింగ్ సెంటర్ పేరుతో మోసం చేస్తున్న వేదాంతు యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
“Vedanthu” college..? A coaching center..? అనుమతులు లేకుండా ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటున్న “వేదాంతు” పై చర్యలు తీసుకోవాలి
* బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు ఆరేగంటి నాగరాజు గౌడ్
హనుమకొండ జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్ పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకుంటున్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ జూనియర్ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేదాంతు జూనియర్ కాలేజ్ అయితే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు వీఆర్వోలను పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఇంటర్మీడియట్ జిల్లా అధికారులు స్పందించి వేదాంత కోచింగ్ పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకుంటున్న కార్పొరేట్ విద్యా వ్యాపారులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
“Vedanthu” college..? A coaching center..? వేదాంతు కోచింగ్ సెంటర్ పేరుతో మోసం చేస్తున్న యాజమాన్యంపై చర్యలు చేసుకోవాలి
• డిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్
వేదాంతు జేఈఈ నీట్ లర్నింగ్ సెంటర్ పేరుతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పూర్తయిన విద్యార్థులను ఇంటర్మీడియట్ లో చేర్చుకుంటూ కోచింగ్ సెంటర్ అంటు విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లు తీసుకుంటూ లక్షల రూపాయలు దండుకుంటున్న వేదాంతు అజమాన్యంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ (డిఎస్ఏ) రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో డీఎస్ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.