‘Unanimous’ discussion in the Parakala Fisheries Society : మత్స్యశాఖ సొసైటీ ఎన్నికల నగారా మోగకముందే పరకాలలో రాజకీయ వేడి మొదలైంది. ముదిరాజ్ కుల సంఘాల మద్దతుతో మాజీ చైర్మన్ జంగేటి సారంగపాణి మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పరకాల నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ కుల సంఘాల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈసారి చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా గతంలో చైర్మన్గా పనిచేసిన అనుభవం, కులంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా జంగేటి సారంగపాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
‘Unanimous’ discussion in the Parakala Fisheries Society..!
అనుభవమే పెట్టుబడిగా..
సారంగపాణి గతంలో మత్స్యశాఖ చైర్మన్గా పనిచేసిన కాలంలో సంఘం బలోపేతానికి, మత్స్యకారుల సంక్షేమానికి చేసిన కృషిని ఈ సందర్భంగా కుల పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం కుల బాంధవుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ముదిరాజ్ కుల గౌరవాన్ని పెంపొందించేలా ఆయన సాగిస్తున్న పయనం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
‘Unanimous’ discussion in the Parakala Fisheries Society..!
ముదిరాజ్ నేతల మంతనాలు…
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు కుల సంఘ ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెజారిటీ నాయకులు సారంగపాణి వైపే మొగ్గు చూపుతున్నట్లు చర్చలు సాగటం గమనార్హం. క్లిష్ట సమయాల్లో సంఘాన్ని నడిపించగల నేర్పు, కులం కోసం, సమాజం కోసం నిరంతరం పాటుపడే తత్వం, అందరినీ కలుపుకొనిపోయే గుణం జంగేటి సారంగపాణికి ప్రత్యేక గౌరవాన్ని పెంచినట్లు అభిప్రాయాలున్నాయి. ”సంఘం అభివృద్ధి చెందాలన్నా, సభ్యులందరికీ న్యాయం జరగాలన్నా అనుభవం ఉన్న నాయకత్వం అవసరం. నిరంతరం కులం కోసం కష్టపడే వారికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాం” అని పలువురు కుల సంఘ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే, పరకాల మత్స్య సొసైటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమని స్థానికంగా చర్చ నడుస్తోంది.
