
నిబంధనలు అతిక్రమించిన ఆ బిల్డింగ్ కు యధేచ్ఛగా అండదండలు అందిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు….
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ బిల్డింగ్ కు నోటీసు ఇచ్చామని చెప్తూనే చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు…
“ముకుంద జ్యూవెల్లర్స్” బిల్డింగ్ పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు అతి ప్రేమ చూపుతున్నారు. హనుమకొండ నగరంలోని “ముకుంద జ్యువెలరీ” బిల్డింగ్ నిర్మాణం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది బహిరంగ రహస్యమే. సదరు బంగారు నగల దుకాణం బిల్డింగ్ ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ బిల్డింగ్ పట్ల అధికారులు అతి ప్రేమ చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ బిల్డింగ్ కు నోటీసు ఇచ్చామని చెప్తూనే చర్యలు చేపట్టడంలో అధికారులు చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ బిల్డింగ్ యాజమాన్యానికి అధికారులకు రహస్యపు ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ముకుందా జ్యూవెలరీ బిల్డింగ్ పట్ల చర్యలు చేపడుతారా లేదా అనేదే వేచి చూడాల్సిందే…!