
- గిరిజన పాఠశాల నిర్వాహణ పట్ల కొరవడిన అధికారుల పర్యవేక్షణ….
- ఇందుకు ములుగు జిల్లా సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలే సాక్ష్యం అనే అభిప్రాయాలు…
- “జన నిర్ణయం” కథనాలను జీర్ణించుకోలేక ఎదురుదాడకి ప్రణాళికలు చేస్తున్న ప్రభుత్వ టీచర్…
- కేసులు పెడుతామంటూ సంకేతాలు
- పోలీసులను సైతం ఆశ్రయించినట్లు సమాచారం….
- తన పలుకుబడితో మద్దతుదారులను కూడగట్టుకుంటున్న వైనం…
- కేసులకు “జన నిర్ణయం” సిద్దమే…
సమగ్ర విచారణకు సదరు టీచర్ కూడా సిద్దంగా ఉండాలంటున్న విశ్లేషకులు… - ఐటిడిఎ పీఓ సమగ్రమైన విచారణ చేపట్టాలంటున్న పలువురు….
Mulugu district ములుగు జిల్లాలో గిరిజన విద్య కుంటుపడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న కొందరి వల్ల అంకిత భావంతో పనిచేస్తున్న టీచర్లకు కూడా మచ్చ వస్తుందనేది గమనార్హం.
మరోవైపు tribal school గిరిజన పాఠశాల నిర్వాహణ పట్ల అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. ఇందుకు ములుగు జిల్లా సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలే సాక్ష్యంగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమ్లాతండా పాఠశాల నిర్వహణ పట్ల, సదరు టీచర్ విధుల నిర్వహణ పట్ల స్థానిక ఐటిడిఎ అధికారుల వివరణ కోసం ఫోన్ లో సంప్రదించగా మొదటి రోజు స్పందించిన అధికారి ఆ తరువాత ఎలాంటి స్పందన లేకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.
ఇక సోమ్లాతండాలో విద్య బోధన సక్రమంగా సాగడం లేదని జన నిర్ణయం వరుస కథనాలు అందిస్తున్న నేపథ్యంలో jananirnayam “జన నిర్ణయం” కథనాలను జీర్ణించుకోలేక సదరు ప్రభుత్వ టీచర్ ఎదురుదాడకి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కేసులు పెడుతామంటూ సంకేతాలు ఇవ్వడంతో పాటు, పోలీసులను సైతం ఆశ్రయించినట్లు సమాచారం. తన పలుకుబడితో మద్దతుదారులను కూడగట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే కేసులకు jananirnayam “జన నిర్ణయం” సిద్దమే…సమగ్ర విచారణకు సదరు టీచర్ కూడా సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉందనేది గమనార్హం. ఇప్పటికైనా ఐటిడిఎ పీఓ సమగ్రమైన విచారణ చేపట్టాలంటున్న పలువురు కోరుతున్నారు.
ఐటిడిఎ పీఓ దృష్టి సారించాలి
కిరణ్
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఐసా)
Mulugu district ములుగు జిల్లా సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల నిర్వహణ పట్ల itda po ఐటిడిఎ పీఓ ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలి. సదరు టీచర్ విధుల నిర్వాహణలో నిజానిజాలు తేల్చాలి. గిరిజన విద్యా కుంటుపడకుండా చూడాలి. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా సదరు టీచర్ బెదిరింపులకు దిగడం సరైనది కాదు. వార్తాకథనాల్లో వాస్తవం లేకపోతే మొదటి కథనానికే స్పందించి ఖండించాలి. కానీ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే స్థానికంగా మద్దతుదారులను కూడగట్టుకొని పోలీసు కేసులు పెడుతామని బెదిరింపులకు దిగడం హాస్యాస్పదమే అవుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఐటిడిఎ అధికారులు స్పందించాలి. సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల నిర్వహణ పట్ల విచారణ చేపట్టాలి. ఇట్టి విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తాం.
సోమ్లాతండ ప్రాథమిక పాఠశాలపై
విచారణ జరిపించాలి
రత్నం ప్రవీణ్
డీవైఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి
Mulugu ములుగు మండలంలోని మల్లంపల్లి దగ్గరలో ఉన్న సోమ్లాతండలోని ఐటిడిఏ పరిధిలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ విధుల నిర్వహణ పట్ల సమగ్రమైన విచారణ చేపట్టాలి. సక్రమంగా విధులు నిర్వహించకపోవడమే కాకుండా చాలా నిర్లక్ష్యంగా పాఠశాలకు రావడం, విద్యార్థులకు విద్యాబోధన చేయకుండా తన వ్యక్తిగత పనుల్లోకి వెళ్లడం జరుగుతుందనే ఆరోపణల్లోని నిజానిజాలు అధికారులు తేల్చాలి. అసలే గిరిజన విద్యా నిర్లక్ష్యం చేయబడుతున్న నేపథ్యంలో ఇలాంటి పాఠశాల దుస్థితి బాధాకరం. సదరు టీచర్ వ్యక్తిగత వ్యాపకాలు ఆయన వ్యక్తిగతమే అయినప్పటికీ విధి నిర్వాహణ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్టి విషయంలో itda officers ఐటిడిఎ అధికారులు స్పందించాలి. తగు విచారణ చేపట్టాలి. ఇట్టి విషయంలో ఐటిడిఎ పీఓ కు వినతి పత్రం అందిస్తాం. విచారణ చేపట్టాలని కోరుతాం. వార్తాకథనాలను జీర్ణించుకోలేక కేసులు పెడుతామని ఎదురుదాడికి దిగడం సరైనది కాదు. పత్రికలకు పత్రికా స్వేచ్ఛ ఉంటుందని ఆ వెలుగులోనే వార్తాకథనాలు అందించబడుతాయని గుర్తెరగాలి.