
- అధికారుల అండతోనే హంటర్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం…!
“Town Planning” blessings for that construction : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమకొండ హంటర్ రోడ్డు ప్రధాన రహదారిలో కడాయి రెస్టారెంట్ దగ్గర మెయిన్ రోడ్డులో ఉన్న అనుమతి లేకుండా అదనపు అంతస్తులు నిర్మించిన భవనం పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు అతి ప్రేమ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవన నిర్మాణం పట్ల పట్టిపట్టనట్లు వ్యవహరించడం పలురకాల అనుమానాలకు తావిస్తోంది. భవనం అనుమతి తీసుకున్న దానికంకంటే అదనంగా అంతస్తులు నిర్మించినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం మౌనంగా ఉండటానికి రహస్యపు ఒప్పందాలే కారణమని పలువురు భావిస్తున్నారు.
“Town Planning” blessings for that construction
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టి ఏస్ బి పాస్ చట్టానికి గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా తూట్లు పడుతుంటే సిటీ ప్లానర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనేక అక్రమ నిర్మాణాలకు అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హనుమకొండ హంటర్ రోడ్డులో అక్రమంగా అదనపు అంతస్తులు భవనం నిర్మించిన విషయం తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం టౌన్ ప్లానింగ్ అధికారులకే చెల్లిందనేది గమనార్హం.