
- బార్ ను తలపించేలా సిట్టింగ్ లు..!
- కుక్కలు మనుషులు ఒకేచోట సిట్టింగ్ అనే ఆరోపణలు…
- ఆహార పదార్థాలల్లో దుర్వాసన అనే అభిప్రాయాలు…
- అపరిశుభ్రతకు నిలయంగా మారిన వైన్ షాప్…
- కనీస పర్యవేక్షణ చేయని ఎక్సైజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధిత అధికారులు…
The wine shop is a favorite : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని వైన్ షాప్ నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్ షాపును తలపించేలా ఆ వైన్ షాప్ నిర్వహణ ఒకభాగమైతే సిట్టింగ్ లోనూ కనీసం పరిశుభ్రత ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కుక్కలు, మనుషులు ఒకేచోట సిట్టింగ్ అనే తరహాలో ఆ వైన్ షాప్ నిర్వహణ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అమ్మే ఆహార తినుబండారాలను సైతం కుల్లిపోయిన వాటిని వినియోగదారులకు అమ్ముతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ వైన్ షాపులో గొడవలు సైతం సర్వసాధారణం కావడం గమనార్హం. ఒకవేళ ఆ వైన్ షాప్ కు పర్మిట్ రూం పర్మిషన్ ఉన్నట్లు అయితే నిబంధనల ప్రకారం పర్మిట్ రూంలో మద్యం తాగడానికి గ్లాసులు, వాటర్, ప్యాకింగ్ చేసిన తినుబండరాలు మాత్రమే విక్రయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఆహార పదార్థాలను మద్యం షాపుల యజమాన్యం కనుసన్నల్లో విక్రయించడం నిబంధనలు గాలికొదిలేయడమే అవుతుందని పలువురు భావిస్తున్నారు.
The wine shop is a favorite :
ఇక పర్మిట్ రూంలో ఒక్క టేబుల్ మాత్రమే ఉండాలి. కానీ 15 నుంచి 20 సిట్టింగ్ టేబుళ్లలాగా ఏర్పాటు చేయడం గమనార్హం. పర్మిట్ రూమ్లలో రెడీ టు ఈట్ ఫుడ్ మాత్రమే అనుమతించాలి. కానీ రెస్టారెంట్ల మాదిరిగా ఏర్పాటు చేసిన ఎగ్స్, తదితర తినుబండారాలను అందుబాటులో ఉండేలా చూస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఎక్సైజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలు తావిస్తోంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవాలని, ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించాలని పలువురు భావిస్తున్నారు.