
- బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు
జన నిర్ణయం / వరంగల్ : స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు జరిపే దాకా ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం లోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు హెచ్చరించారు. బుధవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సిపిఐ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారఖో,నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు ప్రసంగిస్తూ శాసనసభలో బీసీ రిజర్వేషన్ పై ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఆరు నెలలు దాటిన పట్టించుకోకపోవడం బీసీలను అవమానపరచడమేనన్నారు. రాష్ట్రంలోని బిజెపి కేంద్ర మంత్రులు ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే శక్తి లేకపోతే రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తానని చేసిన వాగ్దానం ఏమైందన్నారు. జీవో 9 పై హైకోర్టులో పిటిషన్ వేసిన రెడ్డి జాగృతికి చెందిన బుట్ట మాధవరెడ్డిని తో పాటు బీసీ ద్రోహులకు తగిన గుణపాఠం తప్పదన్నారు. బిసి వ్యతిరేక విధానాలను విడనాడకపోతే వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు.బీసీలకు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లభించే వరకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి పోరాడుతామని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి ప్రసంగిస్తూ రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని బీసీ పోరాటాలకు సిపిఐ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా నాయకులు దండు లక్ష్మణ్ గన్నారపు రమేష్, గుండె బద్రి, సంగీ ఏలేంధర్ బిసి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వలభోజు వెంకన్న బీసీ హక్కుల సాదన సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓర్సు రాజు సిపిఐ సమితి సభ్యులు ఎండి అక్బర్ పాషా,సుంకరి భవాని యాకామ్ర చారి,దస్రు బిసి హక్కుల సాదన సమితి నాయకులు చిట్యాల సువర్ణ పరికరాల రమేష్, నల్లతీగల కుమార్, రాజేందర్, రమేష్, ప్రభాకర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.