
- హనుమకొండ జిల్లా దామెర గుట్టల్లో యధేచ్ఛగా మట్టి దందా..!
- వరంగల్ జిల్లా మాదన్నపేట చెరువును లూఠీ చేస్తున్న మట్టి దందా దారులు…!!
- చోద్యం చూస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు
The soil thieves who have been caught : హనుమకొండ, వరంగల్ జిల్లాలో పలుచోట్ల మట్టి దందా యధేచ్ఛగా సాగుతున్నది. వరంగల్ జిల్లా మాదన్నపేట చెరువును మట్టి దందా దారులు లూఠీ చేస్తుంటే, హనుమకొండ జిల్లా దామెర మండలంలోని గుట్టల్లో యధేచ్ఛగా “ఇందిరమ్మ” ఇండ్ల పేరుతో జోరుగా మట్టి దందా సాగడం బహిరంగ రహస్యంగా మారింది. దామెర మండల పరిధిలోని పలు గ్రామాల గుట్టల్లో యథేచ్చగా సాగుతున్న అక్రమ మట్టి రవాణా పట్ల సంబంధిత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
The soil thieves who have been caught
‘పసరు’ పిండి మరి మట్టి దందా చేస్తూ, గుట్టలు మాయం చేస్తున్నా పట్టించుకొని అధికారుల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “దిల్” ఖుషీగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నప్పటికీ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగానికి రహస్యపు ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. ముఖ్యంగా శని, ఆది వారాల్లో జోరుగా కొనసాగుతున్న మట్టి దందాకు అధికారులే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
The soil thieves who have been caught
పేరుకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్నామని సాకు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పర్మిషన్ ఒక పనికి, చేసే పని మరొకటి అనేది బహిరంగ రహస్యమే. ఇదే తరహాలో వరంగల్ జిల్లా మాదన్నపేట చెరువులోనూ మట్టి దందా జోరుగా సాగుతోందనేది గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు. అధికారులు తమ చిత్తశుద్ధిని చాటుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే…!