
Oplus_131072
- శివనగర్ పాడిమల్లారెడ్డి నగర్ లో యధేచ్ఛగా భూ ఆక్రమణ..!
- ఎర్రజెండా నాయకునికి అండగా నిలుస్తున్న ఖాకీలు…
- బాధిత కుటుంబంపైనే కేసులు పెడుతామని బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులు…
- దిక్కుతోచని స్థితిలో భూ బాధితులు…
- అటు ఎర్రజెండా లీడర్ ఇటు పోలీసులు మధ్యలో నలుగిపోతున్న భూ బాధితులు…
- న్యాయం చేయాలని వేడుకలు….
The Red Flag Leader’s Land Invasion : అన్యాయమే న్యాయంగా భావిస్తే ఇక అభాగ్యులకు దిక్కెవరు..? సమానత్వం, సమసమాజం, భూపంపిణీ గురించి నీతులు వల్లించే ఎర్రజెండా పార్టీకి చెందిన ఓ నాయకుడే అప్పనంగా సరీచప్పుడు కాకుండా భూ ఆక్రమణకు పాల్పడితే ఇక చెప్పుకోవడానికి దిక్కెవరు..? దళిత కుటుంబంలోని వారసత్వ భూ తగాదాలను ఆసరా చేసుకొని భూ ఆక్రమణకు బరితేగించి పిల్లర్స్ స్థాయిలో నిర్మాణానికి సిద్ధపడిన ఎర్రజెండా పార్టీకి చెందిన ఓ జిల్లా ప్రధాన బాధ్యతల్లో ఉన్న నాయకునికి ఖాకీలు సైతం సపోర్ట్ చేస్తే న్యాయం అన్యాయం కాకుండా పోతుందని ఎలా భావించగలం..? దౌర్జన్యంగా బాధితులపై దాడి చేసి గాయపరిచి తమ వారసత్వ ఇంటి స్థలాన్ని లాక్కొని అక్రమ నిర్మాణం చేసుకుంటున్న ఎర్రజెండా పార్టీకి చెందిన నాయకునిపై ఖాకీలకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన భాదితులపైనే కేసులు పెడుతామని ఖాకీలు బెదిరిస్తే ఆ ఖాకీలను రక్షక భటులని ఎలా అనుకోవావో పోలీసులే సమాధానం చెప్పాలి. ఇది శివనగర్ మల్లారెడ్డి నగర్ లో జరుగుతున్న తతంగం.
The Red Flag Leader’s Land Invasion
వరంగల్ శివనగర్ పాడి మల్లారెడ్డి నగర్ లోని ఓ దళిత కుటుంబంలో వారసత్వ భూ తగాదాను ఆసరా చేసుకొని ఎర్రజెండా పార్టీకి చెందిన జిల్లా స్థాయి నాయకులు ఆ స్థలాన్ని ఆక్రమించారని బాధితులు బహిరంగ ఆరోపణలు చేయడం చర్చానీయాంశంగా మారింది. తాటికాయల ప్రభాకర్ పూల దంపతులకు చెందిన స్థలాన్ని సదరు ఎర్రజెండా నాయకుడు “మేక”వన్నే పులిలా కన్నేసి కాజేయడం బహిరంగ రహస్యంగా మారింది. ఆ ఎర్రజెండా పార్టీకి చెందిన నాయకుడు బాధితులపై దౌర్జన్యం చేసి దాడి చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కనీసం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక పోలీసుల తీరు ఆ స్థలాన్ని ఆక్రమించిన నాయకునికి వత్తాసు పలకడం తప్ప బాధితులకు న్యాయం చేసేలా లేదనేది బాధితులతో వ్యవహరిస్తున్న తీరే అద్దం పడుతోంది. బాధిత కుటుంబాన్ని ఒంటరి చేసి కబ్జాదారునికి అండగా నిలిచే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసు సైతం ఆ ఎర్రజెండా నాయకునికే భజన చేసేలా బాధితులను కేసులు పెడుతామంటూ భయబ్రాంతులకు గురి చేయడం గమనార్హం. తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసిన బాధితులపైనే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆ ఎర్రజెండా నాయకునికి సపోర్ట్ చేసేలా వ్యవహరించడం ఖాకీ లకే కలంకం తెస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఘటనపై కొత్త పోలీసు బాస్ సమగ్రమైన విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
- ఎవరా ఎర్రజెండా పార్టీ లీడర్..? ఏమిటా భూ కబ్జా కథ..? సమగ్రమైన కథనం మరో సంచికలో….