The new ruling class that met Indira in Singapore : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరాను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామ నూతన పాలక వర్గంతో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన ఉప సర్పంచ్ గొట్టం రవివర్మని శాలువాతో ఆమె సన్మానించారు. నూతన వార్డు మెంబర్లుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామ సమస్యలను సింగపురం ఇందిరాకు వివరించడంతో ఆమె సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొట్టం రావయ్య , మండల ఎస్సీ సెల్ బైరపాక దివాకర్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టం శ్రీనివాస్, స్థానిక సంస్థల్లో ఎన్నికైన ఉప సర్పంచ్ గొట్టం రవివర్మ, గ్రామ నూతన వార్డు మెంబర్లు కుక్కల లావణ్య, కొయ్యడ మహాలక్ష్మి, సింగారపు అరుణ్, గొట్టం రమేష్, కాయిత హైమావతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
