The film ‘Saganti’ won the cash prize : హనుమకొండకు చెందిన ప్రముఖ చిత్రకారిణి, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అధినేత డాక్టర్ మంజుల సాగంటి రాష్ట్రస్థాయి చిత్రకళా పోటీల్లో నగదు బహుమతికి ఎంపికయ్యారు. ‘జాషువా సాంస్కృతిక వేదిక’ మరియు ‘MBVK ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీల్లో ఆమె ఈ ప్రతిభ కనబరిచారు. మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతుల ఉత్సవాలను పురస్కరించుకుని ‘కుల రహితం – సమాజ హితం’ అనే ఇతివృత్తంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘కులరహిత సమాజం’ అనే అంశంపై నిర్వహించిన చిత్రకళా పోటీల్లో డాక్టర్ మంజుల సాగంటి గీసిన చిత్రానికి ప్రోత్సాహక నగదు బహుమతి లభించింది.
The film ‘Saganti’ won the cash prize
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అనేక చిత్రాల్లో డాక్టర్ మంజుల చిత్రం విశేషంగా ఆకట్టుకుని, విజయవాడలో జరిగే ప్రదర్శనలో స్థానం సంపాదించుకుంది. ఈ నెల 11వ తేదీన విజయవాడలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఈ నగదు బహుమతిని మరియు పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల సాగంటి మాట్లాడుతూ.. సామాజిక మార్పును ఆకాంక్షిస్తూ తాను వేసిన చిత్రానికి గుర్తింపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తన కళా ప్రస్థానంలో మరింత బాధ్యతను, ప్రోత్సాహాన్ని పెంచిందని ఆమె పేర్కొన్నారు.
