
- పంచాయితీకి పిలిచి చితకబాదిన పెద్దమనుషులు..!
- బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు…!!
- పోలీసులు తమ ఇంటి వారేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పెద్దమనుషులు….
- గ్రామ న్యాయస్థానాలను తమ పేటెంట్ గా భావిస్తున్న పెద్దమనుషులు..,
The dominance of the gentlemen in Kothapalli : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో పెద్దమనుషుల పెత్తనం మితిమీరింది. పంచాయితీ అని పిలిపించి పెద్దమనుషులే దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇట్టి ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి న్యాయం జరుగడం లేదని, పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నారు.
The dominance of the gentlemen in Kothapalli
పంచాయతీ ఉందని తమతో మాట్లాడాలని పిలిచిన పెద్దమనుషుల్లో కొందరు ఏకంగా దాడి చేయడం గ్రామ న్యాయస్థానాల ఆధిపత్యాన్ని రుజువు చేస్తున్నదని పలువురు భావిస్తున్నారు. ఆ పెద్దమనుషులకు పోలీసులు సైతం అండగా ఉన్నారని బహిరంగ ప్రచారం చేసుకోవడం వారికే చెల్లింది. ఆ పెద్దమనుషుల్లో ఒకరి కుటుంబంలోని ఓ వ్యక్తి పోలీసు శాఖలో ఆఫీసర్ గా ఉన్నాడని విర్రవీగుతూ పోలీసు శాఖలో అందరూ తమ వాళ్లే అనే తరహాలో వ్యవహరిస్తూ సదరు పెద్దమనుషుల్లో ఒకరు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు ఈ ఘటన పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఇట్టి ఘటనలో బాధితుడు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం గమనార్హం.
The dominance of the gentlemen in Kothapalli
- అసలు ఆ పెద్దమనుషులు చేసిన ఘనకార్యం ఏమిటి..?
- బాధితుడి బాధామేటీ..? పోలీసుల నిర్లక్ష్యం ఏమిటి..? ఆధారాలతో పూర్తి కధనం త్వరలో….