The agricultural revolution is the source of social justice : 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం (1905–1949) ప్రపంచవ్యాప్తంగా విప్లవాల యుగంగా నిలిచింది. రష్యా, చైనా వంటి దేశాలలో జరిగిన విప్లవాల నేపథ్యంలో భారతదేశంలో వ్యవసాయ సమస్యను మార్క్సిస్టు దృక్కోణంతో విశ్లేషించి, విప్లవ పంథాను రూపొందించిన అగ్రగణ్యుడు మద్దికాయల ఓంకార్. ఆయన విశ్లేషణలు, పోరాటాలు భారత దేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్ అవశేషాలను, పెట్టుబడిదారీ సంబంధాల దుష్ప్రభావాలు వెలికితీసి, భూ సంస్కరణల ద్వారా సామాజిక-ఆర్థిక అసమానతలను తొలగించే మార్గాన్ని చూపాడు.
The agricultural revolution is the source of social justice
ఓంకార్ జీవితం, సామాజిక రాజకీయ నేపథ్యం
కామ్రేడ్ ఓంకార్ నాటి తెలంగాణ సంస్థానం సూర్యాపేట తాలూకా నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎస్ )మండలం ఏపూరి గ్రామం లో1926 మే12 వ తేదీన జన్మించాడు. గ్రామీణ జీవనంలో రైతులు, కూలీలు గ్రామీణ పేదల పై భూస్వాముల, దొరల దోపిడీ, వెట్టిచాకిరీ, దౌర్జన్యాలను దగ్గరగా గమనించారు. 16 ఏళ్ల వయసులో, ఆంధ్రమహాసభలో చేరి గెరిల్లా శిక్షణ పొంది దళ కమండర్ గా వరంగల్ నల్లగొండ ఖమ్మం కరీంనగర్ జిల్లలో గ్రామీణ పేదలు రైతు వ్యవసాయ కార్మికులు చేతి వృత్తి దారులను సంఘటితం చేసి, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి నాయకత్వం వహించాడు. 1972నుండి 1994 వరకు నర్సంపేట ప్రాంతం నుండి వరుసగా 5సార్లు శాసన సభ సభ్యుడిగా ఎన్నికయి ప్రజాసమస్యలపై గర్జించిన కామ్రేడ్ ఓంకార్ గారి ని అసంబ్లీ టైగర్ గా ప్రజలే నామకరణం చేశారు.
The agricultural revolution is the source of social justice.
మార్క్సిస్టు దృక్కోణంలో భూమి, రైతంగ, వ్యవసాయ సమస్యల అధ్యయనం
1930 నుండి 1972వరకు, ఓంకార్ ప్రస్తుత తెలంగాణ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక, సామాజిక సంబంధాలను మార్క్సిస్టు దృక్కోణంలో విశ్లేషించారు. ఆయన ముఖ్యంగా “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం -మరియు “భూమి సమస్య” భూమి యాజమాన్యం, ఫ్యూడల్ సంబంధాలు, పెట్టుబడిదారీ విస్తరణ యొక్క దుష్ప్రభావాలను వివరించాడు. “భూమి సమస్య”పై తను బాధ్యత నిర్వహిస్తున్న ప్రాంతలోని గ్రామాలను అధ్యయనం ఆధారంగా, భూమి యాజమాన్య అసమానతలు, వ్యవసాయ సంబంధాలలోని సంక్షోభాన్ని విశ్లేషించారు. నేటి పరిస్థితులలో గ్రామీణ ధనిక కూటమి సాగిస్తున్న దోపిడీ, అణిచివేతలపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని ,దాని ఆధారంగా నూతన కర్తవ్యాలను రూపొందించుకోవాలని. సామాజిక న్యాయానికి మార్గం రూపొందించాడు.
The agricultural revolution is the source of social justice.
వ్యవసాయ సంక్షోభం: సంఖ్యలలో వివరణ
2025 డేటా ప్రకారం, భారత జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 16% ఉండగా, దేశ జనాభాలో 46% మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ అసమానత వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని సూచిస్తుంది. జాతీయ నేర పరిశోధన విభాగం (NCRB) గణాంకాల ప్రకారం, 2014–2025 మధ్య 1,71,418 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు:
2014: 5,650 రైతులు, 6,710 కూలీలు
2015: 8,007 రైతులు, 4,595 కూలీలు
2016: 6,351 రైతులు, 5,019 కూలీలు
2018: 5,763 రైతులు, 4,586 కూలీలు
2019: 5,957 రైతులు, 4,324 కూలీలు
2020: 5,579 రైతులు, 5,098 కూలీలు
2021: 5,318 రైతులు, 5,563 కూలీలు
2022: 5,207 రైతులు, 6,083 కూలీలు
2023: 4,690 రైతులు, 6096 కూలీలు
2024: 4600,రైతులు, 6100,కూలీలు
2025: డేటా (NCRB)విడుదల చేయలేదు కేవలం ఒక్క మహారాష్ట్ర లోనే 3నెలలోనే 776 మంది రైతులు చనిపోయారు
ఈ దేశంలో గంటకో రైతు రాలిపోతున్నాడు
ఈ గణాంకాలు అప్పుల భారం, ఆర్థిక ఒత్తిడి, సామాజిక అసమానతలను ప్రతిబింబిస్తాయి. సుమారు 1.04 కోట్ల మంది రైతులు వ్యవసాయానికి దూరమవడం వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్రతను సూచిస్తుంది.
The agricultural revolution is the source of social justice.
మార్క్సిస్టు విశ్లేషణ: ఫ్యూడల్ నుండి పెట్టుబడిదారీ సంబంధాల్లోకి పరివర్తన
మార్క్స్, లెనిన్ విశ్లేషణల ఆధారంగా, ఓంకార్ భారత వ్యవసాయ సమస్యలను అధ్యయనం చేశారు. ఫ్యూడల్ సమాజం పెట్టుబడిదారీ విధానంలోకి రూపాంతరం చెందడానికి రెండు మార్గాలను గుర్తించారు. విప్లవకర ప్రజాస్వామిక మార్గం: ఫ్యూడల్ భూస్వాముల భూములను ఎటువంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకొని, భూమిలేని నిరుపేదలకు, పేద రైతులకు పంపిణీ చేయడం. ఇది ఫ్యూడల్ గుత్తాధిపత్యాన్ని ధ్వంసం చేసి, సామాజిక అసమానతలను తగ్గిస్తుంది. అభివృద్ధి నిరోధక మార్గం: భూమి గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ, ఫ్యూడల్ భూస్వాములు పెట్టుబడిదారీ భూస్వాములుగా మారడం, రైతులను వేతన కార్మికులుగా రూపాంతరం చేయడం. ఇది అసమానతలను, వివక్షలను కొనసాగిస్తుంది. ఓంకార్ మొదటి మార్గాన్ని సమర్థించగా, భారత పాలకవర్గాలు రెండవ మార్గాన్ని ఎంచుకున్నాయి. దీని ఫలితంగా, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు, పెట్టుబడిదారీ భూస్వాములు, వ్యవసాయ సంబంధిత యంత్రాలు , పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పరిశ్రమల పెట్టుబడిదారులు లాభాలు ఆర్జిస్తున్నారు.
The agricultural revolution is the source of social justice.
భూ సమస్య: వ్యవసాయ సంక్షోభానికి మూలం
కామ్రేడ్ ఓంకార్ భూ సమస్యను మౌలిక సమస్యగా గుర్తించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత “దున్నేవానికి భూమి” అనే నినాదంతో విప్లవకర భూ సంస్కరణలను సూచించారు. ఆయన సుమారు 1లక్ష 67 వేల ఎకరాల భూమి భూపోరాటాల ద్వారా పంపిణీ చేయడం, ద్వారా ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపారు. నేటికీ భూ పంపిణీ సమస్యే కీలకమైనదిగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగినప్పటికీ, దేశంలో సంపూర్ణ భూ సంస్కరణలు సాధ్యం కాలేదు. స్వాతంత్ర్యానంతర ఏడు దశాబ్దాలలో భూ గుత్తాధిపత్యం బద్దలు కాకపోవడం వల్ల, సామాజిక అసమానతలు, కుల వివక్షలు, ఆర్థిక దోపిడీ కొనసాగుతున్నాయి. భారతదేశంలో సాగుకు అనువైన భూమిలో 50శాతం కొద్ది మంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. భూమిపై గుత్తాధిపత్యం వ్యవసాయ సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అవుతుంది.
The agricultural revolution is the source of social justice.
సామాజిక మార్పుకు పునాది వ్యవసాయ విప్లవం: కామ్రేడ్ ఓంకర్ పరిష్కార మార్గం
ఓంకార్ సూచించిన విప్లవకర పంథాలో భూ సంస్కరణలు అమలు చేయాలి. భూస్వాముల భూములు స్వాధీనం చేసుకొని, పేద రైతులకు, వ్యవసాయ కూలీలకు గ్రామీణ పేదలకు పంపిణి చేయాలి. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి ఏకైక మార్గం. అలాకాకుండా రెండవ మార్గంలో పెట్టుబడిదారీ సంబంధాల విస్తరణ జరిగితే, సామాజిక, ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తుంది, రైతులను, కూలీలను వేతన బానిసలుగా మారుస్తుంది.
విప్లవ వాస్తవికత అంటే “కార్మిక వర్గ విముక్తి కోసం చేసే కృషిలో ప్రజల దైనందిన జీవిత సమస్యలను నిర్దిష్టమైన సామాజిక, చారిత్రక నేపథ్యంలో నిర్దిష్టంగా విశ్లేషణ చేయడం.” ఓంకార్ భారతదేశంలో ఈ కృషి చేశారు. ఓంకార్ మార్క్సిస్టు విశ్లేషణ ఆధారంగా, ఫ్యూడల్ గుత్తాధిపత్యాన్ని ధ్వంసం చేసి, భూమిని దున్నేవారికి పంచడం ద్వారా మాత్రమే గుణాత్మక అభివృద్ధి సాధ్యమని నిరూపించారు. ఈ విప్లవకర పంథాలో పయనించకుంటే వ్యవసాయ సంక్షోభం కొనసాగుతుంది, రైతులు, వ్యవసాయ కూలీల దుర్భర జీవనం మరింత దిగజారుతుంది. భారత వ్యవసాయ రంగంలోని సంక్షోభం, ఆత్మహత్యలు, భూ అసమానతలు, సామాజిక వివక్షతలు, ఆర్థిక ఒత్తిడి, భూ సమస్యను పరిష్కరించకుండా నివారించడం అసాధ్యం. రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను రక్షించుకోలేము. అవి జరగాలంటే ఓంకార్ చూపిన మార్గం మినహా వేరే దారి లేదు. ఆ దారిలో పయనించడానికి సమాయత్తం కావడమే మన ముందున్న కర్తవ్యం. అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి శతజయంతి వర్షి కోత్స వాల సందర్బంగా మనం ఇచ్చే నిజమైన నివాళి. (2026)నూతన సంవత్సరం శుభాకాంక్షలతో……
- మాలోతు సాగర్ Mcpi(u) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు – వరంగల్ జిల్లా Cell : 7013805411 (mcpi(u)wgl city committee)
