“Telangana Rythu Raksha Santhiya” joint Warangal district calendar launched తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా క్యాలెండర్ను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. హనుమకొండ జిల్లా అధ్యక్షులు భాస్కర్, ఉపాధ్యక్షులు చాలా రామారావు, రవీందర్తో పాటు జిల్లా నాయకులు సురావు బాబురావు, లోనే సతీష్, వంకే రాజు తదితరులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం కృషి చేస్తుందని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడుతూ, ప్రభుత్వానికి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.
