
- నల్లబెల్లిలో అస్మదీయుల అండతో యథేచ్ఛగా సాగుతున్న “బాలసంత” రేషన్ దందా..!
- దాడులు జరుగుతున్నా ఆగని రేషన్ బాలసంత కింగ్ పై టాస్క్ ప్రత్యేక దృష్టి సారించినట్లు వినికిడి…
- స్థానిక అధికారుల పాత్రపై అనుమానాలు..?
- టాస్క్ఫోర్స్ దాడులు జరిగితేనే “బాలసంత” చీకటి రాజ్యం వెలుగుచూసే అవకాశం…
Task force on “ration racket” : వరంగల్ జిల్లాలో దాడులు జరుగుతున్నా రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Task force on “ration racket”
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో “బాలసంత”నేతృత్వంలో అస్మదీయుల అండతో యథేచ్ఛగా రేషన్ దందా సాగడం బహిరంగ రహస్యమే. ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ “జన నిర్ణయం” వరుస కథనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విస్తృత చర్చ జరుగగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇంతగా కట్టడి చేస్తున్నప్పటికీ నల్లబెల్లి మండలంలో జరుగుతున్న రేషన్ బియ్యం దందాకు స్థానిక అధికారుల సపోర్ట్ ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ దాడులు జరిగితేనే “బాలసంత” చీకటి రాజ్యం వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. బియ్యం రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నప్పటికీ అక్రమ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు వివిధ మార్గాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది.
Task force on “ration racket”
బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచి పట్టుకుంటున్నప్పటికీ అక్రమ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నల్లబెల్లి మండలంలో బాలసంత నేతృత్వంలో మరింత రేషన్ బియ్యం దందా చెలరేగిపోతుందనేది బహిరంగ రహస్యంగా మారింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలోనూ నల్లబెల్లి మండలంలో బాలసంత నేతృత్వంలో యధేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు దాడిచేసి పట్టుకున్నప్పటికీ మరింత బరితెగింపుతో చీకటి దందా సాగించడం పట్ల టాస్క్ ఫోర్స్ సీరియస్ గా దృష్టి సారించినట్లు సమాచారం.
- ఉగాదికి సన్నబియ్యం పక్కాగా ప్లాన్ చేద్దాం. ఎవరేం చేయలేరు. పుష్ప తరహా ప్లాన్ లో బాలసంత. ఆసక్తికరమైన కథనం మరో సంచికలో…