
- 18న రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు
- బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు
జన నిర్ణయం / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ నేడు కొట్టివేయడం అత్యంత బాధాకరమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల సాధనకు 18న జరగనున్న రాష్ట్ర బంద్ కు బీసీ హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% అమలు జరగాలంటే 9వ షెడ్యూల్లో చేర్చడం తప్ప మరో మార్గం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగ రంగాల్లో మరియు స్థానిక సంస్థల్లో42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉభయసభలలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిస్తే పార్లమెంట్లోఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదన్నారు. ఆరు ఏడు శాతం లేని అగ్రవర్ణాల పేదల కోసం ఆగమేఘాల మీద పార్లమెంటులో బిల్లు పాస్ చేస పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన బిజెపి 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఎందుకు పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చడంలేదని ప్రశ్నించారు.తెలంగాణలోని బిజెపి కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీల,బీసీసంఘాల అఖిలపక్షంతో కేంద్రంపై ఎందుకు ఒత్తిడితేవడంలేదో చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలని జరగనున్న బంద్ లో వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యార్థి యువకులు మేధావులు అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధనకై సమర శంఖం పూరిం చాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.