
శాయంపేట తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ మారెపెల్లి వినయ్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ శివారులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్స్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మండల యూత్ ప్రెసిడెంట్ మారెపల్లి వినయ్ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ నిర్వహించబడుతుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతులకు మించి తవ్వకాలు, విచ్చలవిడిగా బోర్ బ్లాస్టింగ్ లు చేస్తున్నారని ఆరోపించారు.
చుట్టుపక్కల వ్యవసాయ పంటలపై దుమ్ము ధూళి వ్యాపించడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బావులలోని నీరు అడుగంటి పోతుందని బోరుబావులలో నీరు కూడా అడుగంటి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇదే క్రషర్ లో డాంబర్ ప్లాంటు ఏర్పాటు చేసి ప్లాంట్ నుంచి వచ్చే వాయువు పీల్చే గాలిలో కలవడం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సార్లు ఈ క్రషర్ పై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు తగు చర్చలు చేపట్టడకపోవడం వల్ల స్టోన్ క్రషర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ స్టోన్ క్రషర్ పెట్టినప్పుడు పుట్టని వాళ్లు కూడా ఫిర్యాదు చేస్తే ఎలా…? శాయంపేట తహశీల్దార్ వింత ప్రశ్న సమగ్రమైన కథనం త్వరలో…