
- అంకెల గారడితో మాయ చేసిన రాష్ట్ర బడ్జెట్
- యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
State budget is a juggling act : రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్బాటంగా శాసనసభ లో నేడు ఆర్బాటంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరువై ఐదు కోట్ల రూపాయల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, వివిధ వర్గాలకు కెటాయించిన నిదులు మాటలు బారెడు – చేతలు చారెడు మాదిరిగా ఉన్నాయి అని ఈ బడ్జెట్ గత బి ఆర్ యస్ అంకెల గారడీ బడ్జెట్ గా ఉంది అని పాత సీసాలో కొత్త సారాయి లాగా ఉందని దీనితో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు పాలక కాంగ్రెస్ పార్టీని చిత్తు గా ఓడిస్తారు అని అందుకు తగిన మూల్యం చెల్లించటానికి కాంగ్రెస్ పాలకులు సిద్దంగా ఉండాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉదాహరణకు జనాభా లో 50’/, ఉన్న మహిళా, శిశు సంక్షేమానికి కేవలం రూపాయలు 2,862 కోట్లు, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన జనకుల గణనలో నూటికి 56’/, ఉన్న బిసి ల అభివృద్ధి సంక్షేమానికి రూపాయలు 11, 405 కోట్లు ఏ మూలకు సరి పోతాయి అని నిన్న అసెంబ్లీలో 42’/, బిసి రిజర్వేషన్ కు ఈ నిదులు ఎలా సరి పోతాయి అని ఇది ఏ మాత్రం ప్రజా పాలన కాదు అని స్పష్టం అవుతోంది అని అన్నారు.
State budget is a juggling act
షెడ్యూల్డ్ కులాల కు, షెడ్యూల్ తెగలకు కలిపి చూస్తే రూపాయలు 57, 401 కోట్లు కెటాయించి వాటిని ఎలా ఖర్చు పెడుతారో చెప్పలేదు అని కాగితాల మీద కెటాయింపు తప్ప మరేమీ కాదు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో యువజన రంగానికి నిదులు కెటాయింపు లేదని అందులో పారిశ్రామిక రంగానికి రూపాయలు 3, 527 కోట్లు ఇచ్చారు అని వీటితో పరిశ్రమలు స్థాపన ఎలా ఉద్యోగం కల్పన ఎలా సాధ్యం అని క్రీడారంగం నకు కేవలం రూపాయలు 465 కోట్లు ఎలా నైపుణ్యం పెరుగుతుంది అని ప్రోత్సాహం ఎలా సాధ్యం అని అన్నారు. ఆరోగ్య శ్రీ బకాయి లే నేడు కెటాయించిన బడ్జెట్ రూపాయలు 12,393 కోట్లు అయితే మరి రానున్న సంవత్సరం వైద్య రంగం ఎలా ముందుకు పోతుంది అని ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్ష గా మారుతొంది అని అన్నారు. విద్యా రంగానికి బడ్జెట్ లో 20’/, నిదులు కెటాయించక కుండా కేవలం రూపాయలు 23,108 కోట్లు కెటాయించటం వలన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు, మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల ల అభివృద్ధి కి ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోతుంది అని ప్రశ్నించారు. మొత్తంగా విద్య, వైద్య కార్పోరేట్ శక్తులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.
State budget is a juggling act
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీ ల పేరుతో ఇచ్చిన హామీల అమలు కు ఈ బడ్జెట్ కెటాయింపు లో పైస కెటాయింపు లేక పోవడం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను తుంగలో తొక్కి కప్పదాటు చర్యలకు దిగుతున్న తీరు ప్రజలు సహించరు అని యంసిపిఐ(యు) హెచ్చరిస్తుంది. బడ్జెట్ లో బిసి లకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు, విద్య, వైద్య, ఆరు గ్యారంటీ ల అమలు కు బడ్జెట్ ను సవరించాలని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు.