Sports competitions begin under the auspices of Mera Yuva Bharat : క్రీడలతోనే సత్ప్రవర్తన సాధ్యమని ధర్మసాగర్ ఎస్సై దిలీప్ అన్నారు. సోమవారం ధర్మసాగర్ వేలేరు బ్లాక్ లెవెల్ మీట్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ఆవరణలో మేర యువభారత్ వరంగల్ కేంద్ర ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ధర్మసాగర్ ఎస్ఐ దిలీప్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ధర్మసాగర్ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో ప్రయాణించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతా యని అన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని అన్నారు. పూర్వం తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి మళ్లించి మందలించే ప్రయత్నం చేయలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కొంత భయం చెప్పి అవసరమైతే దండించి సన్మార్గంలో పెట్టి పెద్దల పట్ల గౌరవభావంగా మెలిగేందుకు కృషి చేసేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు తల్లిదండ్రులు కల్పించకపోవడం వల్ల చిన్నతనం నుండి క్రమశిక్షణ కొరవడి సమాజానికి విఘాతం కలిగించే యువ శక్తులుగా తయారవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను సత్ప్రవర్తన కలిగిన యువకులుగా తీర్చిదిద్దేందుకు సమన్వయం చేసుకునేవిధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేర యువభారత్ వాలంటీర్ మండ రాజేష్, ఈసంపల్లి రమేష్, పిడి శ్రీనాథ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు ప్రభాకర్, భాస్కర్, గణేష్, వేణు, గోపాలకృష్ణ, బాబురావు, మంజుల, రవళి, యూత్ సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు.
