
నాణ్యమైన మందులను వాడాలి
ఘనంగా బేయర్ డీలర్స్ మీట్
తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు
రైతులకు అండగా డీలర్స్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. నవత ఆగ్రో కెమికల్స్ ఆధ్వర్యంలో వరంగల్ శివనగర్ లోని ది వరంగల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో బేయర్ డీలర్స్ మీట్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కంపెనీనుండి భారీ లాభాలు ఆశించకుండా రైతులకు న్యాయం చేసే విధంగా రైతుల పక్షపాతిగా డీలర్స్ ఉండాలని అన్నారు.వరిలో కలుపు మందు కౌన్సిల్ యాక్టివ్ మరియు మోగి పురుగు నివారణకు వయాగో ని వాడటం వలన వరి రైతులు ఎలా అధిక దిగుబడులు మరియు లాభాలు పొందవచ్చో వివరించారు.రైతులు ఎక్కువగా నమ్మేది డీలర్స్ నే అని,అటువంటి డీలర్స్ రైతులకు ఎప్పుడూ మేలు చేయాలని అన్నారు.చట్టానికి లోబడి న్యాయపరంగా మాత్రమే విత్తనాలు,పెస్టిసైడ్స్ మరియు పురుగుమందులను విక్రయించాలని అన్నారు. నకిలీ మందులు,విత్తనాలను విక్రయించవద్దని అన్నారు.కంపెనీ తరఫున మీకు అండగా మేమున్నామని భరోసానిచ్చారు.నకిలీ కంపెనీల నుండి అరికట్టడానికి లీగల్ సెల్ కూడా పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నవత ఆగ్రో కెమికల్స్ భాగస్వాములు నరేంద్ర కుమార్, రంజిత్, బేయర్ కంపెనీ కమర్షియల్ మేనేజర్ అశోక్ రెడ్డి, క్యాంపెయిన్ మేనేజర్ నారాయణ రెడ్డి,వరంగల్ బిజినెస్ మేనేజర్ సతీష్,పరకాల బిజినెస్ మేనేజర్ శివేష్,వీరితో పాటు శ్రీనివాస్,అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ రెడ్డి,రాజేందర్ రెడ్డి, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.