
- అమాయకులే టార్గెట్..!
- పైరవీల పేరుతో “సంప”దానే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఘనుడు…
- ఆయనకు తోడుగా మరో ఘనుడు ఉన్నట్లు ప్రచారం…
- టీం వర్క్ గా గుట్టుగా సాగుతున్న ఉద్యోగాల టోకరా దందా…
- అవసరమైతే తీసుకున్న ముడుపులు తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలుకుతున్న ఘనుడు…
- బాధితులకు ప్రామిసరి నోట్ కూడా రాసిచ్చే సాహసం చేసిన పైరవీదారు…
- ఆ పైరవీ దారు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పలువురు బాధితులు…
దారా
స్పెషల్ కరస్పాండెంట్ / జన నిర్ణయం
Singareni employment scam భూపాలపల్లి జయశంకర్ జిల్లా singareni సింగరేణిలో ఉద్యోగాల పేరుతో దందా సాగుతున్నట్లు సమాచారం. ఉపాధి కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి “ఉద్యోగాల ఎర” చూపుతూ సమ్మగా సరీచప్పుడు కాకుండా “సంప”ద పోగేసుకునే పనిని కొందరు పనిగా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరికి అమాయకులే టార్గెట్. పైరవీల పేరుతో “సంప”దానే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఓ ఘనుడు ఏకంగా ఉద్యోగం ఇప్పించకుంటే తీసుకున్న ముడుపులు తిరిగి ఇచ్చేస్తామంటూ రాతపూర్వకంగా అగ్రిమెంట్ సైతం రాసియడానికి సిద్ధపడుతుండటం గమనార్హం. ఆ ఘనుడికి తోడుగా మరో ఘనుడు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదో టీం వర్క్ గా గుట్టుగా ఉద్యోగాల టోకరా దందా యధేచ్ఛగా సాగుతున్నట్లు పలువురు బాధితుల ఉదంతాలు తెలుపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచినా బాధితుల ఆశలు ఫలించక పోవడం, ఆ పైరవీ దారు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో పలువురు బాధితులు కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం.
* సింగరేణిలో ఉద్యోగాల దందా కథేంటి..? ఎవరా పైరవీ దారు..? మోసపోయిన బాధితులకు అతగాడు రాసిచ్చిన అగ్రిమెంట్ కథ ఏమిటి..?
ఆధారాలతో కూడిన సమగ్రమైన కథనం త్వరలో…