
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎస్ఐ పరమేశ్వర్ కు అభినందనల వెల్లువ
Hanumakonda district హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట దగ్గరలో గల కస్తూర్బా హై స్కూల్ ఎదురుగా 353సి నేషనల్ హైవే రోడ్డుకు మూల మలుపుల వద్ద ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ జెసిపి సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఈ మూలమలుపుల వద్ద పిచ్చి మొక్కల వల్ల సైడ్ నుంచి వచ్చే వాహనాలు ఎదురుగా వచ్చే వారికి కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అందుకే వీటిని తొలగించడం జరిగిందని తెలిపారు. హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించిన ఎస్సై జక్కుల పరమేష్ ను స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు. శాయంపేట ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే లా అండ్ ఆర్డర్ విషయంలో, రోడ్డు భద్రత విషయంలో ప్రత్యేక చొరవ చూపిన ఎస్ఐ పరమేశ్వర్ ను పలువురు రాజకీయ నాయకులు, యువకులు, ప్రజలు మహిళా సంఘాల వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.