
- సినీ నటుడు శోభన్ బాబును మించి ఆ అధికారి నటిస్తున్నట్లు ప్రచారం…
- అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూనే సత్యహరిచ్ఛంద్రుడిలా ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలు..?
- వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రతీ సేవకు ఓ రేటు ఫిక్స్ చేసి మరీ ప్రైవేట్ అసిస్టెంట్ లతో వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐ లు..?
“Shobhan Babu” in the Transport Department : తెలుగు హీరో శోభన్ బాబును మించిన నటన ఆ అధికారికే సాధ్యం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదట, ఆ కార్యాలయంలో వసూళ్ల జాతర నడుస్తున్నా…ఎలాంటి అక్రమ వసూళ్లు జరగడం లేదని స్మార్ట్ గా యాక్ట్ చేయడంతో వరంగల్ జిల్లాలోని వాహనదారులు ఇప్పుడు ఆ అధికారిని హీరో శోభన్ బాబుతో పోల్చుతూ శోభన్ బాబును మించి ఈ అధికారి నటిస్తున్నాడని వాహనదారులు విమర్శలు చేయడం గమనార్హం.
“Shobhan Babu” in the Transport Department
ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నా, ప్రతి సేవకు అక్రమంగా ప్రైవేట్ అసిస్టెంట్ వసూళ్లు చేస్తున్నా, తనకేమీ తెలియనట్లు నటించడం ఈ అధికారికే చెల్లుతోందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. వివిధ రకాల సేవల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుండి ప్రతీ సేవకు ఓ రేటు ఫిక్స్ చేసిన వీరు ప్రైవేట్ అసిస్టెంట్ తో చుక్కల రూపంలో వసూళ్లకు పాల్పడుతూ తమచేతికి మట్టి అంటకుండా ప్రతీ రోజు అందినకాడికి దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
“Shobhan Babu” in the Transport Department
- ఏ సేవకు ఎంత లంచం..?
- వసూళ్లు చేస్తుందెవరు…? చేపిస్తున్నదెవరు..?మరో కథనంలో…