
- కేయూ ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాసరావు
Kakatiya university కాకతీయ విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన మరియు మానవ వనరుల విభాగంలో విభాగాధిపతి ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విభాగాధిపతి మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ విధిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసినటువంటి kakatiya university కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్. చిర్రా రాజు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ తమ విధిగా భావిస్తూ మొక్కల పెంపకాన్ని చేపడుతూ విశ్వవిద్యాలయాన్ని పచ్చదనంగా ఉంచాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విభాగం అధ్యాపకులు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు,డాక్టర్ చీకటి శ్రీను, డాక్టర్ ఉమా శంకర్, డాక్టర్ మోహన్, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.