- మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్…
- వెయ్యికి పైగా జాతీయ పురస్కారాలు..
- కరోనా కాలంలో కడలి అంతటి సాయం..
- రాజకీయాల్లో ‘నారీ న్యాయ్’ గళంగా క్రాంతిజ్యోతి అధినేత్రి…
Seva Shikharam Rajini Rudrama : ఆమె అడుగు పెడితే అది సేవా పథం.. ఆమె గళం విప్పితే అది అబలల పక్షం. క్రాంతిజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సామాజిక సేవను ఒక యజ్ఞంలా భావించి, వేలాది మంది జీవితాల్లో మార్పు తెస్తున్న డాక్టర్ రజిని రుద్రమ ప్రస్థానం అద్వితీయం. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించి, నేడు జాతీయ స్థాయిలో వెయ్యికి పైగా అవార్డులు అందుకున్న అరుదైన మహిళా మూర్తిగా ఆమె రికార్డు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమె ఒక సాధరణ ప్రయివేటు ఉపాధ్యాయురాలు.. కానీ ఆమె ఆశయం అసాధారణం. సమాజంలో మార్పు రావాలని కోరుకోవడమే కాదు, ఆ మార్పుకు తానే ఒక వేదిక కావాలని సంకల్పించారు. క్రాంతిజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతూ, సేవే పరమావధిగా దూసుకుపోతూ నేటి తరం మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.
Seva Shikharam Rajini Rudrama
కరోనా కాలంలో కడలి అంతటి సాయం.. ఉస్మానియాలో అన్నదాతగా..
కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో, ప్రాణాలకు తెగించి బాధితుల పక్షాన నిలిచారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో వరుసగా 45 రోజుల పాటు నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహించి వేలాది మంది ఆకలి తీర్చారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీతో ‘క్రాంతిజ్యోతి’ సేవా నిరతిని చాటుకున్నారు.
ముదిరాజ్ ‘లేడీ ఐకాన్’.. గౌరవ డాక్టరేట్ పట్టా ఆమె చేస్తున్న నిరంతర కృషని గుర్తించి మద్రాస్ వేదిక్ యూనివర్సిటీ ‘గౌరవ డాక్టరేట్’ ప్రదానం చేయగా, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ చేతుల మీదుగా ‘ముదిరాజ్ లేడీ ఐకాన్’ పురస్కారాన్ని అందుకున్నారు. సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసినందుకు గానూ వివిధ జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థల నుండి సుమారు 1000 వరకు అవార్డులు దక్కించుకోవడం ఆమె సేవా పటిమకు నిదర్శనం.
Seva Shikharam Rajini Rudrama
- ఆర్థిక స్వావలంబన దిశగా…
మహిళలు ఆర్థికంగా ఎదగాలని సంకల్పించి 2000 మందికి పైగా ఉచిత కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీ చేపట్టారు. పేపర్ ప్లేట్స్, జ్యూట్ బ్యాగ్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో ఆమె అందించిన సహకారానికి గానూ రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ‘బెస్ట్ విమెన్ ఎంట్రప్రెన్యూర్ – 2020’ అవార్డును అందుకున్నారు. కేవలం సేవకే పరిమితం కాకుండా, రాజకీయాల ద్వారా వ్యవస్థలో మార్పు తేవాలని కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం, ప్రజా సమస్యల కోసం ఢిల్లీ వేదికగా గళమెత్తిన ఆమెకు, నేషనల్ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్ అల్కా లాంబా స్వయంగా ‘నారీ న్యాయ్’ స్పెషల్ బ్యాడ్జ్ను ధరింపజేసి గౌరవించడం విశేషం.
Seva Shikharam Rajini Rudrama
మీడియా రంగంలోనూ ‘క్రాంతిజ్యోతి’ గా తమదైన ముద్ర…
తెలుగు జాతీయ దినపత్రిక ‘క్రాంతిజ్యోతి’ మరియు న్యూస్ ఛానల్ ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టి, ఒక స్వచ్ఛంద సంస్థ నుండి మీడియా రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారు. జర్నలిజం రంగంలో ఆమె చేస్తున్న పోరాటానికి గానూ ‘డాక్టరేట్ ఇన్ జర్నలిజం’ కూడా లభించటం గమనార్హం.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, సావిత్రి బాయి పూలే, గద్దర్ వంటి మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ రజిని రుద్రమ చేస్తున్న ఈ ప్రయాణం భావితరాలకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.
